విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ – సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ ముగ్గురు కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెడుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఎఫ్ 3 కోసం వరుణ్ తేజ్ తనకి వెంకటేష్ తో సమానంగా రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. ఈ రెమ్యూనరేషన్ వలనే కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ ఆగిందని గుసగుసలు కూడా వినిపించాయి.

ఆఖరికి దిల్ రాజు అంతా సెట్ చేసి ఈ ప్రాజెక్ట్ ను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారనేది బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. హీరో వెంకటేష్ కి 12 కోట్లు రెమ్యూనరేషన్. ఇక వరుణ్ తేజ్ కి 8 కోట్లు, తమన్నాకి 2 కోట్లు, మెహరీన్ కి 70 లక్షలు, కమెడియన్ సునీల్ కి 75 లక్షలు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కి 3 కోట్లు, డైరెక్టర్ అనిల్ రావిపూడికి 12 కోట్లు రెమ్యూనరేషన్.. ఇంకా వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి.. ఇలా స్టార్ కాస్ట్ చాలా ఉందట.
ఇలా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషనే 40 కోట్లు దాటేస్తుందట. షూటింగ్ 60 నుంచి 70 రోజులు ప్లాన్ చేసారట. అంతా కలిపి బడ్జెట్ దాదాపు 80 కోట్లు అవుతుందని అంచనా వేసారని తెలిసింది. అయితే.. ఈ కథ పైన, అనిల్ రావిపూడి పైన నమ్మకంతో దిల్ రాజు ఇంత బడ్జెట్ పెట్టడానికి ఓకే చెప్పారట. మరి.. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఎఫ్ 3 బాక్సాఫీస్ వద్ద ఏ స్ధాయి విజయం సాధిస్తుందో చూడాలి.
Must Read ;- ‘ఎఫ్ 3’లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరా ముద్దుగుమ్మలు?











