విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 ఆల్ ఆడియన్స్ ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. 2019లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా వెంకీ, వరుణ్ కెరీర్ లో మరచిపోలేని సినిమాగా నిలిచింది. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 ఎంటర్ టైన్మెంట్ మూవీస్ కి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
వెంకీ పుట్టినరోజు సందర్భంగా..ఎఫ్ 3 మూవీని ఎనౌన్స్ చేసారు. దీనికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో వెంకీ, వరుణ్ ఓ చిన్న బండిలో డబ్బులు తోసుకుంటూ వెళుతున్నట్టు ఉంది. అంతే కాకుండా.. నవ్వుల వ్యాక్సిన్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం అని వెంకీ వాయిస్ లో, నవ్వుకోవడానికి మీరు కూడా థియేటర్స్ కు వస్తారుగా అని వరుణ్ తేజ్ వాయిస్ లో వినిపించారు. అంతే కాకుండా.. ఎఫ్ 2 లో పాపులర్ డైలాగ్ అయిన అంతేగా.. అంతేగా.. అనే డైలాగ్ తో ఉన్న వీడియో రిలీజ్ చేసారు.
దీనికి సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన లభిస్తుంది. Issue డబ్బులు అయినప్పుడు మరి ఫన్ peaks లొనే ఉంటుందిగా…అంతేగా అంతేగా… అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. పలువురు సినీ ప్రముఖులు ఎఫ్ 2 మూవీ వలే ఎఫ్ 3 కూడా సక్సస్ సాధిస్తుందని ఆశిస్తూ.. టీమ్ కి ఆశీస్సులు అందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి.. అందరూ ఆశిస్తున్నట్టుగా ఎఫ్ 3 కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- ‘ఎఫ్ 3’లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరా ముద్దుగుమ్మలు?