Virgin Galactic Space Tour :
సాధారణంగా పారచ్యూట్ సాయంతో కొండలు, గుట్టల్లో విహరిస్తేనే.. ప్రపంచం చుట్టేసిన అనుభూతి కలుగుతుంది. మరి అలాంటిది అంతరిక్షంలోకి దూసుకెళ్తే.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. అంతరిక్ష యాత్ర నిజంగా మహా అద్భతమే అని చెప్పక తప్పదు. ఈమధ్యే మన తెలుగు అమ్మాయి శిరీష బండ్ల ఆకాశపు అంచులను తాకివచ్చింది. జీవితానికి సరిపడే మెమరీస్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష యాత్ర ఎలా ఉంటుంది. ఏవిధంగా సాగుతుందనే విషయాలు చాలామందికి ఆసక్తిని కలిగించాయి.
ఎలా సాగిందంటే..
స్పేస్ యాత్ర కొనసాగాలంటే.. కచ్చితంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. అప్పుడే యాత్ర మొదలవుతుంది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించాకే షూరు అయ్యింది. నేల నుంచి దాదాపు 88 కి.మీ. ఎత్తుకు చేరుకున్నాక.. వ్యోమగాములు ఒకవిధమైన భావోద్వేగానికి లోనయ్యారు. యాత్ర సమయంలో యూనిటీ-22 కిటికీల గుండా బయట పరిస్థితులను స్వయంగా తిలకించి కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నారు. మహాసముద్రాలు.. భూమి పచ్చదనం.. తెల్లని మంచు.. కప్పుకొన్న పర్వతాలను చూసి.. చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు.‘‘ఈ యాత్ర కోసం చిన్నప్పటినుంచీ ఎన్నో కలలు కన్నాను. అంతరిక్షం నుంచి భూమిని చూడటం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఏదో మాయాజాలంలా అనిపించింది”అని స్పేస్ యాత్ర చేసినవాళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
నిజంగా అద్భతమే..
అంతరిక్షానికి వెళ్లి భూమిని చూడటం ఒక ‘అద్భుతం’ అని తెలుగు అమ్మాయి శిరీష బండ్ల చెప్పారు. యాత్ర గురించి వివరిస్తూ.. ఇంకా నేను అక్కడ ఉన్నట్లే ఉందని, అంతరిక్షానికి వెళ్లి రావడం గురించి చెప్పాలంటే.. అద్భుతం అనే మాట కన్నా ఇంకా పెద్ద పదం కోసం వెతుకుతున్నా. పై నుంచి భూమిని చూడటం అనేది ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్ పీరియెన్స్” అని శిరీష ఆనందం వ్యక్తంచేశారు. డబ్బున్నవాళ్లకు మాత్రమే.. జాలీ రైడ్‌గా మాత్రమే మారుతుందా? అని అడగ్గా.. భవిష్యత్తులో అందరికీ స్పేస్ టూర్‌ను అందుబాటులోకి తేవాలన్నదే వర్జిన్ గెలాక్టిక్ లక్ష్యమని అన్నారు.
Must Read ;- తెలుగువారికి సేవ చేస్తానంటున్న నవనీత్ కౌర్
Virgin Galactic Space Tour :