శీను వాసంతి లక్ష్మి, శత్రువు, జగపతి, గుబ్ బాయ్, రూమ్ మేట్స్, యమదొంగ తదితర చిత్రాల్లో నటించిన కథానాయిక నవనీత్ కౌర్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి(ఎస్సీ) లోక్‌సభ నియోకవర్గ నుంచి గెలిచి ఎంపీ అయ్యింది. అయితే.. ఇప్పుడు నవనీత్ కౌర్ రాణా పదవికి గండం వచ్చిపడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆమె ఎస్సీ కాదని బాంబే హైకోర్టు ప్రకటించింది.
కౌర్‌ను మోచీ కులానికి చెందిన ఎస్సీగా పేర్కొంటూ ముంబై డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని జస్టిస్ ఆర్.డి.ధనుక, జస్టిస్ వి.జి.బిస్త్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ఊరట లభించింది. ఈ సందర్భంగా ఇటీవల నవనీత్ కౌర్ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా నవనీత్ కౌర్ మాట్లాడుతూ.. ఓటమిని తట్టుకోలేకే తనపై తప్పుడు కేసు వేశారని మండిపడ్డారు. తనకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు నవనీత్ కౌర్ వెల్లడించారు.
తన పోరాటం శివసేనపై మాత్రమేనని స్పష్టం చేశారు. తన ప్రధాన ప్రత్యర్థి శివసేన అని తేల్చి చెప్పారు. నాకు తెలుగు భాష అంటే ఎంతో అభిమానం. తెలుగు ప్రజలు నాకు లైఫ్ ఇచ్చారు. కొవిడ్ సమయంలో చాలా మంది విద్యార్థులకు హెల్ప్ చేశాను. పార్టీలకతీతంగా పార్లమెంట్‌లో గళం వినిపిస్తున్నాను. నన్ను తెలుగు ప్రజలు ఎంతో ఆదరించారు. అవకాశం వస్తే.. తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను అన్నారు. నా భర్త ఎమ్మెల్యే కావడంతో రాజకీయాల పై మరింత ఆసక్తి పెరిగింది. నా భర్తకు చేదోడువాదోడుగా ఉంటాను. మా కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉంది.
నాకు పార్టీ కంటే ప్రజా సేవే ముఖ్యం. నా భర్త సహకారం వల్లే రాజకీయాల్లో కొనసాగుతున్నా. ఇండిపెండెంట్‌గా గెలవాలంటే అంత ఈజీ కాదు. నా నియోజకవర్గంలో మా కులస్థులు 200 మందే ఉన్నారు. ప్రజాభిమానమే నన్ను గెలిపించిందన్నారు. గోవింద, సునీల్‌శెట్టి నాకు ఎన్నికల్లో ప్రచారం చేశారు. నటుడు సోనూసూద్ అందరికీ స్ఫూర్తిదాయకం అని నవనీత్ కౌర్ కొనియాడారు. మహారాష్ట్ర ప్రజల తర్వాత, తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు నవనీత్ కౌర్ తెలిపారు.
Must Read ;- శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ రమణ దంపతులు











