ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘అఖండ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చివరి షెడ్యూల్ నిన్న స్టార్ట్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. అయితే.. అఖండ సినిమా తర్వాత బోయపాటి సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా కన్ ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరూ కలిసి సరైనోడు సినిమా చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో కలసి మరో సినిమా చేయాలనుకున్నారు.
అఖండ తర్వాత బోయపాటి బన్నీతో సినిమా చేయడం కన్ ఫర్మ్ అని గట్టిగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బోయపాటి తదుపరి చిత్రం బన్నీతో కాదు.. తమిళ హీరో సూర్యతో అని వార్తలు వచ్చాయి. సూర్య – బోయపాటి కాంబినేషన్ లో మూవీని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. సూర్య ఎప్పటి నుంచో స్ట్రైయిట్ తెలుగు మూవీ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు బోయపాటితో ఫిక్స్ అయ్యిందని ఈమధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు బోయపాటి.. తదుపరి చిత్రం కేజీఎఫ్ హీరో యశ్ తో అని వార్తలు వస్తున్నాయి.
అయితే.. బోయపాటి బన్నీతో సినిమా చేయడానికి టైమ్ పడుతుంది. అందువల్ల బోయపాటి నెక్ట్స్ మూవీ తెలుగు హీరోతో కాకుండా పొరుగు హీరోతోనే అనేది కన్ ఫర్మ్. అయితే… అది సూర్యతోనా..? లేక కేజీఎఫ్ హీరో యశ్ తోనా..? అనేది తెలియాల్సి ఉంది. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.
Must Read ;- ఆఖరి దశలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ‘అఖండ’











