వైసీపీ నేత వేధింపులు తట్టుకోలేక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వీఓఎల సంఘం బందరు మండల అధ్యక్షురాలు గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన గరికపాటి నరసింహరావు వేధింపులు భరించలేక నాగలక్ష్మి తన స్వగ్రామం భోగిరెడ్డిపల్లిలో బలవన్మరణానికి యత్నించింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగలక్ష్మి మృతి చెందింది.వైకాపా నేత గరికపాటి నరసింహరావు వేధింపులపై నాగలక్ష్మి నెల రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసిందని..పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.నాగలక్ష్మి ఫిర్యాదు చేసిందనే కోపంతో నెల రోజులుగా ఆమెపై అధికార పార్టీ నాయకుడు నరసింహారావు వేధింపులు అధికామయ్యాయని, వేధింపులు భరించలేకే నాగలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Must Read:-వైసీపీని గెలింపించి పెద్ద తప్పు చేశా.. తన చెప్పుతోనే తానే కొట్టుకున్న మాజీ మంత్రి!











