సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు!
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని వాలంటీరు చేసిన మోసానికి సామాన్యులు రోడ్డున పడ్డారు. పొదుపు, చీటీల పేరుతో జిల్లాలోని సాలూరు పట్టణంలోని చిట్లవీధికి చెందిన వార్డు వాలంటీరు మానాపురం రమ్య రూ. 3 కోట్లును వసూలు చేసుకుని, కుటుంబంతో సహా పరారయ్యారు. 15 ఏళ్లుగా రమ్య, ఆమె తల్లి అరుణ పొదుపు పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. కొంత సొమ్ము చెల్లిస్తే ఎక్కువ వడ్డీ ఇస్తామనడంతో చిరు వ్యాపారులు, రోజువారి కూలీలు, మురికివాడల్లోని మహిళలు వారి వద్ద పొదుపు కట్టారు. రోజు, వారం, నెల ప్రాతిపదికన సుమారు 2 వేల మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. రోజుకు రూ. పది నుంచి రూ. 200 వరకు వసూలు చేస్తున్నారు. రూ. 10 కట్టిన వారికి రూ. 4 వేలు, రూ. 200 కట్టిన వారికి రూ. 80 వేలు ఏడాదికి వడ్డీతో చెల్లించాల్సి ఉంది. గడువు పూర్తయిన డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో వాలంటీర్ పై ఫిర్యాదు చేశారు.
మూడు నెలలుగా రిటర్నన్స్ చెల్లించకపోవడంతో ..
పేద ప్రజల నుంచి పొదుపు పేరుతో వసూలు చేసిన నగదును గడువు తీరిన తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు వత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. గత ఏడాది డిసెంబరు నెలతో సుమారు 150 మందికి గత ఏడాది డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. చెల్లించకపోవడంతో గట్టిగా నిలదీశారు. దీంతో సాకులు చెప్పుకుంటూ కాలం గడిపింది. పదిరోజులు క్రితం పెళ్లికి వెళ్తున్నాం అని చెప్పి తిరిగి రాకపోవడంతో మోసపోయామని గుర్తించి బాధితులు వార్డు వాలంటీరు రమ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Must Read:-మరీ ఇంత దోపిడీనా : వాలంటీర్లకు సీఎం ఏటా రూ.3700 కోట్లు దోచిపెడుతున్నారు











