ఆ నియోజకవర్గంలో గెలుపు కోసమేనా?
ఉత్తరప్రదేశ్ గోసాయీగంజ్ నియోజకవర్గాన్ని ఎస్పీ, భాజాపాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి! ఇరుపార్టీల నుంచి బలమైన నాయకులు పోటీలో దిగడంతో గెలుపుకోసం సర్వశక్తుల ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య మాటలు యుద్ధంతో పాటు చేతలకు సైతం వెనకాడటంలేదు! గోసాయీగంజ్ నియోజకవర్గంలో ఎస్పీ నుంచి అభయ్ సింగ్, భాజాపా తరుఫున ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారి సతీమణి ఆర్తీ తివారీ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా రెండు వర్గాలకు చెందిన కార్లు కబీర్పూర్లో ఎదురుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
కాల్పులకు తెగబడ్డారు..
అయోధ్యలోని కబీర్పూర్లో చెలరేగిన ఘర్షణలు, మరోసారి శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఘటనపై పోలీస్ లను ఎస్పీ నేతలు ఆశ్రయించారు. అయితే గతంలో జరిగిన ఘర్షణలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకులేదని వాపోతున్నారు. దీంతో మరోసారి ఘర్షణ తలెత్తడంతో ఒకరిపై ఒకరు కాల్పులకు జరుపుకున్నారు. దీంతో పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించి, కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో నాలుగు వాహనాలు ధ్వంసమైనట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
bjp
Must Read:-అయోధ్యలో తిరుమల వేంకటేశ్వరుని ఆలయం











