కృష్ణా జిల్లా రాజకీయం హీటెక్కింది. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గుడివాడలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేసి పట్టుకున్న తరవాత ఇది మరింత ముదిరింది. మంత్రి కొడాలి నాని తన అనుచరులతో పేకాట ఆడిస్తున్నాడని, మాజీ మంత్రి దేవినేని ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి కొడాలి రెచ్చిపోయారు. పేకాట ఆడితే ఉరి శిక్ష వేస్తారా? కేసు పెడతారు. కోర్టులో రూ. 50, రూ.100 ఫైన్ కట్టి బయటకు వస్తారంటూ లైట్ తీసుకున్నారు. ఆ తరవాత కూడా వారి మధ్య మాటల యుద్దం ఆగలేదు. నిన్న మైలవరం మీటింగ్ లో మంత్రి కొడాలి నాని మరోసారి బూతులందుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటికి వెళ్లి బడిత పూజ చేస్తామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.
డైరెక్టుగా ఫోన్ చేసి తిట్టినా వీడికి సిగ్గు లేదని, చంద్రబాబు ఏం చేశాడో, జగన్ ఏం చేశాడో చర్చించుకుందా? రా మగాడివైతే రా? అంటూ సవాల్ విసిరారు. మంత్రి కొడాలి సవాల్ కు నిరసనగా దేవినేని ఉమ నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు.
దేవినేని ప్రతి సవాల్
ఈ పోరంబోకు మంత్రితో, బూతుల మంత్రితో సీఎం జగన్ మాట్లాడిస్తున్న మాటలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి దేవినేని ఇవాళ నిరసనకు సిద్దమయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో 1000 మంది పోలీసులను మోహరించారు.
గొల్లపూడిలో 144 సెక్షన్ విధించారు. టీడీపీ వారిని ఎవరినీ ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా పోలీసులు తరిమివేస్తున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. మంత్రి కొడాలి నానికి దమ్ముంటే, దేవినేని ఉమను టచ్ చేసి చూడాలని టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా రాజకీయాలు హీటెక్కాయి.
గొల్లపూడి ఉద్రిక్తం
గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. నిరసనలకు పూనుకున్న తెలుగుదేశం నాయకుల్ని పోలీసులు నిలువరిస్తున్నారు.
Must Read ;- నవ్విపోదురుగాక ‘నానీ’కేంటి సిగ్గు!