రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ సర్ ప్రైజ్ వచ్చేసింది. 24 గంటల వ్యవధిలో 6.3 మిలియన్ ట్వీట్లు సాధించడమే ఆ విశేషమట. అదికూడా కాదు మొన్న ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే పేరును ప్రేరణగా రివీల్ చేశారు. ఈరోజు హీరో ప్రభాస్ పేరును రివీల్ చేస్తూ మరో లుక్ విడుదల చేశారు. ఇంతకీ ఇందులో ప్రభాస్ పేరేంటో తెలుసా.. విక్రమాదిత్య.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. రాధాకృష్ణకుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పేరు తాజగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు మొదట అమిత్ త్రివేది సంగీత దర్శకుడిగా ఖరారైంది. కారణం ఏదైనా గానీ ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అసలు సర్ ప్రైజ్ రెండు రోజుల్లో రానున్న టీజర్. విక్రమాదిత్య లుక్ ఎలా ఉందో చూడండి.
23వ తేదీ ఆ అప్ డేట్ ఏమిటి?
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమిటన్నది అందరిలోనూ కుతూహలంగా ఉంది. ఇది మోషన్ పోస్టర్ అంటున్నారు. ఇది కాస్త నిడివి ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని టీజర్ అని కూడా అనుకోవచ్చు. ఈ సినిమా కథ రొమాంటిక్ ప్రేమ కథ. దేవదాస్ – పార్వతి, లైలా – మజ్ను సలీం – అనార్కలి తరహాలో ఉంటుందని అనుకోవచ్చు. మూగమనసులు మాదిరిగా పూర్వజన్మ లాంటిది కూడా ఈ సినిమా కథా నేపథ్యం కావడానికి అవకాశం ఎక్కువ ఉంది. (also read: జిగేలు రాణి బుట్టబొమ్మగా మారి ప్రేరణగా పుట్టిన వేళ)
ఈ నెల 23వ తేదీన విడుదలయ్యే టీజర్ లో ఇందాక మనం అనుకున్న ప్రేమికులను పరిచయం చేస్తారని తెలుస్తోంది. చివరలో అరచేతిని చూపిస్తారని సమాచారం. అంటే హస్తసాముద్రికం కూడా ఈ కథలో భాగం కావచ్చు. ఆ చేతిని నుంచి దూరంగా కొండలు, అక్కడి నుంచి పొగలు కక్కుతూ వచ్చే రైలు, అందులో నుంచి ఎగురుతున్న చున్నీ, దాన్ని ఓ చేయి పట్టుకోవడం, ఆ తర్వాత హీరోయిన్ రైలు డోర్ దగ్గర కనిపిస్తుంది. ఆ వెంటనే ఆరడుగుల ఆజానుబాహుడైన హీరో తన కాలును నేల మీద పెడుతూ కనిపిస్తాడట. దీనికి జస్టిన్ ప్రభాకరన్ చక్కటి సంగీతాన్ని అందించాడని అంటున్నారు.
ఇంతకీ ఈ జస్టిన్ ప్రభాకరన్ ఎవరు? ఒకేసారి ఇంత పెద్ద సినిమాకి సంగీతం అందించే అవకాశం ఎలా వచ్చింది? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అతను విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ద్వారా మొదటిసారిగా సంగీత దర్శకుడిగా తెలుగులోకి ప్రవేశించారు. ఆ సినిమా పాటలు ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిక్ రొమాంటిక్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఇంకా సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, భీనా బెనర్జి, మురళీ శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు నటిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. వచ్చే ఏడాది మాత్రమే ఈ సినిమా విడుదలవుతుంది. నటుడు కృష్ణంరాజు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీద చిత్రనిర్మాతలు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
#RadheShyam has set the new benchmark in twitter with 6.3M+ tweets in 24Hours💥.
Huge thanks to all Darling fans❤️#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju garu @itsBhushanKumar @TSeries with #Vamshi #Pramod & @PraseedhaU @UV_Creations @AAFilmsIndia pic.twitter.com/ZaXl4rxP6o— UV Creations (@UV_Creations) July 11, 2020