బిగ్ బాస్.. తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న రియాల్టీ షో. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు పూర్తి కావడం.. 5వ సీజన్ కోసం ప్రస్తుతం కసరత్తు జరుగుతుండడం తెలిసిందే. నాలుగవ సీజన్ లో తెలిసిన ఫేస్ లు చాలా తక్కువ కనిపించాయి. అందుచేత ఈసారి అలా కాకుండా సెలబ్రిటీలను రంగంలోకి దించేందుకు స్టార్ మా యాజమాన్యం పక్కా ప్లాన్ రెడీ చేస్తుందని తెలిసింది. బిగ్ బాస్ 5 లో పాల్గొనే కంటెస్టంట్స్ అంటూ కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. దీంతో సీజన్ 5 పై మరింత ఆసక్తి ఏర్పడింది.
బిగ్ బాస్ షో సక్సస్ అవ్వడంలో నాగార్జున కీలక పాత్ర పోషించారని చెప్పచ్చు. కారణం ఏంటంటే.. బిగ్ బాస్ 4 లో కొత్త ముఖాలే దర్శనమిచ్చినా.. నాగ్ తనదైన శైలిలో హోస్ట్ గా షోను రక్తి కట్టించారు. నాలుగవ సీజన్ కూడా రికార్డ్ స్ధాయి టీఆర్పీ సాధించి బ్లాక్ బస్టర్ సక్సస్ సాధించడంతో త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 5కు కూడా నాగార్జునే హోస్ట్ అని గత కొంత కాలంగా వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈసారి బిగ్ బాస్ హోస్ట్ మారనున్నారనేది ఆ వార్త సారాంశం. మరి.. నాగార్జున ప్లేస్ లో వచ్చే న్యూ హోస్ట్ ఎవరంటే.. టాలీవుడ్ యంగ్ హీరో దుగ్గుబాటి రానా అని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.
గత రెండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కింగ్ నాగార్జున.. ఐదో సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అందుకే వరుసగా సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వలో యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఆతర్వాత బంగార్రాజు మూవీ చేయనున్నారు. నాగ్ తప్పుకోవడంలో బిగ్‌బాస్ నిర్వాహకులు పలువురు యంగ్ హీరోలను పరిశీలించారని సమాచారం. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానాని కాంటాక్ట్ చేశారని.. ఆయనే ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సివుంది.
Must Read ;- ‘బిగ్ బాస్ 5’ లోకి ఎంట్రీ ఇస్తోన్న హాట్ బ్యూటీ ?