కరోనా నివారణలో రోగనిరోధకశక్తి చాలా కీలకం. అందుకే చాలామంది ఇమ్యూనిటీనిచ్చే ఫుడ్ ను క్రమంగా తప్పకుండా తీసుకుంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన పద్ధతులను పాటిస్తున్నారు. ఇప్పతీగ, కషాయం, నిమ్మరసం లాంటివి తీసుకుంటున్నారు. కరోనా వేళ.. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కూడా రోగనిరోధశక్తిని పెంచుకోవచ్చట. అసలు అరటిలో భోజనం చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలున్నాయో తెలుసా..
వేడి వేడి అన్నం ఆకులో వడ్డించడం వల్ల అనేక రకాల పోషకాలు కరిగి శరీరంలోకి చేరుతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిథులకు అరిటాకులో భోజనం వడ్డిస్తారు. ఇందులో భోజనం చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. తిన్నది సులభంగా జీర్ణమయ్యే శక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులో విటమిన్లు ఉండటంతో.. మనం తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఎన్నో రకాల జబ్బులను దూరం చేస్తుంది.
శరీరానికి ఎంతో మేలు
అరటి ఆకులో అన్నం తింటే.. వెంటనే జీర్ణమవుతుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఆకలి వేసేందుకు కూడా అరటి ఉపయోగపడుతుంది. శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమన్లను అందిస్తుంది.
ఇమ్యూనిటీని పెంచుతుంది
అసలే ఇది కరోనా కాలం. చాలామంది రోగ నిరోధకశక్తి కోసం చికెన్, మటన్, డ్రైప్రూట్స్ తింటున్నారు. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. వేడి వేడి వంటకాలు ఆకులో వడ్డించుకొని తినడం వల్ల అనేక రకాల విటమిన్లు శరీరానికి సమకూరి, రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
క్రిములు చనిపోతాయి
అరటి ఆకుల్లో అన్నం తింటే పేగుల్లోని క్రిములు సైతం చనిపోతాయి. ఇందుకోసమే మన పూర్వీకులు అరటి ఆకులో తినేవాళ్లు. ఆకులో రోజూ భోజనం చేయడం వల్ల దీర్ఘాకాలిక వ్యాధులు కూడా నయమవుతాయి. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సైతం దూరంగా ఉంటాయి.
పర్యావరణానికి మేలు
అరటి ఆకులు ఆరోగ్యానికే కాదు.. పర్యావరణానికి మేలు చేస్తాయి. తినేసిన ఆకులను బయటపడేయడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. ఇవి అందుబాటులో లేనప్పుడు విస్తరాకులు, తామరాకుల్లోనూ భోజనం చేయవచ్చు. ఇవి కూడా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి.
Must Read ;- మార్నింగ్ వాక్ తో ఉల్లాసం ఉత్సాహం : రోజు అరగంట నడిస్తే..!











