గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో సీఎం జగన్ రెడ్డి తడబడుతూ మాట్లాడారు. ఆయన దిశ యాప్ గురించి వివరిస్తూ… ‘ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాఅంటే… మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తూ ఓ మహిళ కాబట్టి’ అని మైక్ పట్టుకొని మరీ చెప్పారు. ఆ పక్కనే ఉన్న హోంమంత్రి అలర్ట్ చేయడంతో హోమ్ మినిస్టర్.. అంటూ ఓ నవ్వు నవ్వారు. ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.
జగన్ జైలుకెళ్తారా..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కామెంట్స్ పై పలు ఆరోపణలొస్తున్నాయి. జగన్ పై తరచుగా అవినీతి ఆరోపణలు వస్తుండటం.. జైలుకెళ్తారనే సంకేతాలు వస్తుండటంతోనే తన మనసులో మాటను బహిర్గతం చేశారని ప్రతిపక్ష నాయకులతో పాటు ఏపీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు భారతి రెడ్డిని వెంట తీసుకెళ్లుతున్నారని, ఆమెకు పాలనపై అవగాహన కల్పిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ట్వీట్ మరింత ఆసక్తిగా మారింది. గొల్లపూడిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ‘ఏపీ సీఎం ఓ మహిళ’ అని చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తుచేశారు. జగన్ కామెంట్స్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘’ఏంటి సంగతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు.. భారతి రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన బహిర్గతం చేశారా…? లోపల మాట్లాడుకునే మాటలు మీ వాళ్లని మానసికంగా సంసిద్ధుల్ని చేసేందుకు ఇలా మాటలు వదిలినట్టు ఉన్నారు. జైలు కి వెళ్లడానికి సిద్ధం అయ్యారు అని అంతఃపురం టాక్…! అందుకే ఇలా నిజాలు మాట్లాడారు’’ అని ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
Must Read ;- జగన్‌కు హింట్ ఇచ్చిన ABN ఆర్కే.. కమలదళం వ్యూహం అదేనా..?
ఏంటి సంగతి ముఖ్యమంత్రి @ysjagan గారు..
భారతి రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన బహిర్గతం చేసారా…?
లోపల మాట్లాడుకునే మాటలు మీ వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేసేందుకు ఇలా మాటలు వదిలి నట్టు ఉన్నారు. జైలు కి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు అని అంతః పురం టాక్…!— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) June 30, 2021










