కరోనా నుంచి కోలుకుని టాలీవుడ్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వస్తోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి భారీ చిత్రాలు రిలీజ్ కావడం.. భారీ విజయాలు సొంతం చేసుకోవడం తెలిసిందే. అయితే.. కరోనా కారణంగా ఈ సంవత్సరం 50 శాతం సిటింగ్ కెపాసిటికే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నారు.
ఆఖరికి థియేటర్లకు జనాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కళ్లలో ఆనందం కనిపించిందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. సమ్మర్ కి సినిమాల పోటీగా గట్టిగా ఉంబడోతుంది. మహా శివరాత్రి నుంచే సినిమాల సందడి స్టార్ట్ కానుంది. మార్చి 11న నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. శర్వానంద్ తాజా చిత్రం శ్రీకారం. ఈ చిత్రాన్ని మార్చి 11న రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు.
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం మోసగాళ్లు, నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు, శ్రీ విష్ణు గాలి సంపత్ చిత్రాలు మార్చి 11న రిలీజ్ కానున్నాయి. ఈ నాలుగు సినిమాలు పోటీపడుతుండడంతో వీటిలో ఏ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- నెగెటివ్ రోల్లో శర్వానంద్.. ఏ సినిమా?











