సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాత్త’. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీరం, విశ్వాసం..’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన శివ.. రజనీ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడం, రజనీ అనారోగ్య కారణాల వలన ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేశారు.
ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీరితో పాటు ఖుష్బూ సుందర్, మీనా, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. శివ తెరకెక్కించిన ‘విశ్వాసం’ చిత్రానికి మ్యూజిక్ అందించిన డి.ఇమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. డిసెంబర్ లో హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత టీమ్ మెంబర్స్ లో కొంత మందికి కరోనా రావడం.. ఆతర్వాత రజనీ అస్వస్థకు గురవ్వడంతో షూటింగ్ బ్రేక్ పడింది.
ఫిబ్రవరి నుంచి తాజా షెడ్యూల్ ప్రారంభించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. అనారోగ్య కారణాల వలన రాజకీయల్లోకి రాలేనని చెప్పిన రజనీకాంత్ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తే విమర్శలు వస్తాయని.. షూటింగ్ కి ఇంకొంచెం టైమ్ తీసుకోవాలి అనుకుంటున్నారని టాక్ వినిపించింది. తాజా షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా తెలియాల్సివుంది.
Must Read ;- రజనీకాంత్ అప్పుడు చాలా ఫీలయ్యారట!
#Annaatthe will be releasing on November 4th, 2021!
Get ready for #AnnaattheDeepavali! @rajinikanth @directorsiva @KeerthyOfficial @immancomposer pic.twitter.com/NwdrvtVtSE— Sun Pictures (@sunpictures) January 25, 2021