నాగచైతన్య నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. చైతు – సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ స్టోరీ ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం కంటే ముందుగానే నాని టక్ జగదీష్ మూవీని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పుడు నాని సినిమాకి పోటీగా నాగచైతన్య లవ్ స్టోరీ మూవీని రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేయడంతో నాని షాక్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. వరుస ఫ్లాప్ లో ఉన్నప్పుడు చైతన్యకి సక్సస్ అందించిన చిత్రం మజిలీ. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. తనకి సక్సస్ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ మూవీకి పోటీగా తన సినిమాని రిలీజ్ చేయడం చైతన్యకి ఏమాత్రం ఇష్టం లేదట.
అయితే.. ఏప్రిల్ 16కి టక్ జగదీష్ మూవీ రిలీజ్ కాదని.. వాయిదా పడనుందని చెప్పడంతో చైతన్య లవ్ స్టోరీని ఏప్రిల్ 16న రిలీజ్ చేయడానికి ఓకే చెప్పారట. మరో విషయం ఏంటంటే.. దీని వెనక దిల్ రాజు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో నాని మూడు సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు దిల్ రాజుకు మంచి లాభాలు తెచ్చాయి. ఇప్పుడు తన సినిమా పైనే పోటీగా నాగచైతన్య సినిమాని రిలీజ్ చేయించడం వెనక దిల్ రాజు ఉన్నారని తెలిసి షాక్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. మరి.. ఏప్రిల్ 16న నాగచైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్ రెండూ రిలీజ్ అవుతాయా..? లేక లాస్ట్ మినిట్ లో వాయిదా పడతాయో..? చూడాలి.
Must Read ;- అక్కినేని బ్రదర్స్ లో విన్నర్ గా నిలిచేదెవరు.?