పల్లెల్లు, పట్టణాలు అంటూ తేడా లేకుండా టెక్నాలజీ అంతటా విస్తరించింది. టెక్నాలజీ పెరగడంతో, ఎలక్ర్టానిక్ వస్తువులు సైతం మనిషి జీవితంలో సర్వసాధారణమయ్యయి. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవాలన్నా.. ఇతరులతో ఫోన్ మాట్లాడాలన్నా.. జూమ్ కాల్స్ మీటింగ్ అటెంప్ట్ చేయాలన్నా.. ఇయర్ ఫోన్స్ వాడకం విధిగా మారింది. వీటితో లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే ఉన్నాయి.. కొన్ని గంటల పాటు కంటిన్యూగా ఇయర్ ఫోన్స్ వాడితే.. అనారోగ్య సమస్యలతో బాధపడినట్టే.. ఇయర్ ఫోన్స్ అతిగా వాడటం వల్ల చెవి నరాలకు సంబంధించి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నేళ్ల పాటు అలాగే వాడితే.. చెవులు కూడా పనిచేయని స్థాయికి చేరుకుంటాయని అంటున్నారు.
చాలామంది కుర్రకారు ఎక్కువ సౌండ్స్ తో సినిమా పాటలు వింటుంటారు. అప్పటి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మాత్రం కచ్చితంగా కర్ణభేరి మీద ఒత్తిడి పడుతుంది. చెవి లోపల ఉండే సున్నితమైన కణాలు దెబ్బ తిని వినికిడి సమస్యలు తలెత్తుతాయి కూడా. ఇయర్ ఫోన్స్ గంటల తరబడి వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదాలు కూడా ఉన్నాయి. వీటితో మరికొన్ని అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. సో.. ఇయర్ ఫోన్స్ వాడకం వీలైనంత వరకు తగ్గించడమే మంచిదని అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇయర్ ఫోన్స్ వాడాలి వస్తే.. స్పీకర్ ఆన్ లో పెట్టుకొని కాల్స్ మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Must Read ;- సౌకర్యాలతో పాటు రిస్క్‌లూ చాలా.. స్మార్ట్ ఫోన్ల వాడకంలో జర భద్రం











