పెరుగుతోన్న వయసును పట్టించుకోకుండా.. తమలోని గ్లామర్ కోణాన్ని ఇంకా ఇంకా వెలికితీస్తుంటారు కొందరు ముద్దుగుమ్మలు. లేటు వయసులో ఘాటు అందాల ప్రదర్శనకు తెరతీస్తారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే బాలీవుడ్ బ్యూటీ .. అమీషా పటేల్. అందమైన అభినయం, అభినయానికి తగ్గ అందం ఆమె ఆభరణాలు. దానికి తన స్పైసీనెస్ కూడా యాడ్ చేస్తూ.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే భారతీయ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
‘కహోనా ప్యార్ హై’తో బాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చిన అమీషా .. అదే ఏడాది తెలుగులోనూ పవర్ స్టార్ ‘బద్రి‘లో కథానాయికగా మెరిసింది. ఈ రెండు సినిమాలు అమీషాకి అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటూ.. టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే.. హిందీతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లో సైతం గ్లామరస్ గా చెలరేగింది. అయితే ఆ తర్వాత తెలుగులో అమ్మడు చేసిన ‘నానీ, నరసింహుడు, పరమవీరచక్ర’ సినిమాలు డిజాస్టర్ అవడంతో అమీషా మళ్ళీ తెలుగులోనూ కనిపించలేదు. అలాగే అటు బాలీవుడ్ లోనూ అమీషా తన స్టార్ డమ్ కోల్పోయింది.
ప్రస్తుతం అమీషా సోషల్ మీడియా వేదికగా హాట్ షోస్ షురూ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తరచుగా అమీషా పటేల్ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాను ఊపేయడం కామన్ గా జరుగుతోంది. ఈ క్రమంలో ఆమెకి ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఏర్పడ్డారు. తాజాగా అమీషా పటేల్ మరోసారి గ్లామర్ పరంగా చెలరేగిపోయింది. తన వయసును మరిచిపోయి మరీ మోతాదును పెంచి .. కుర్రకారును తెగ రెచ్చగొడుతోంది. అలాగే.. ఆమె అదే ఫిట్ నెస్ నూ మెయిన్ టెయిన్ చేస్తూ .. చూపరుల్ని భలేగా ఎట్రాక్ట్ చేస్తోంది.
Must Read ;- షవర్ బాత్ లో శ్రద్ధా ఆర్య స్విమ్ సూట్ సోయగాలు