కథానాయిక సరిత గుంటూరులో జన్మించింది. ఈ తెలుగు అమ్మాయి బాలచందర్ తెరకెక్కించిన మరో చరిత్ర సినిమా ద్వారా తెలుగు తెర పై ఎంట్రీ ఇచ్చింది. తన
అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఎందరో ప్రేక్షకుల గుండెల్లో కొలువుతీరింది. సరిత నటి మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆమె గాత్రం ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఎంతో మంది కథానాయికలకు తన గాత్రాన్ని అందించింది. అయితే.. సరిత చూడడానికి నల్లగా ఉన్నా.. ముఖం మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో విరిసిన ఒక నల్ల కలువ అని అప్పట్లో పిలిచేవారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది.
అంతే కాకుండా ఎందరో తెలుగు, తమిళ హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెప్పింది. అన్ని భాషల్లో కలుపుకుని 150 సినిమాలు వరకు చేసింది. 7 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు అనేక అవార్డులు కూడా అందుకుంది. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో అండాళ్ అనే నెగిటివ్ క్యారెర్ట్ చేసి మెప్పించింది. ఈ సినిమాకు గాను స్పెషల్ జ్యూరీ నంది అవార్డ్ అందుకుంది. అప్పట్లో మొదటి సినిమాతోనే సరిత సంచలనం సృష్టించింది. రీల్ లైఫ్ లో సక్సస్ సాధించిన సరిత రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదొర్కొంది. సరిత రెండు సార్లు పెళ్లి చేసుకుంది. 1975లో రంగస్థల నటుడు వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకుంది.
కొన్ని కారణాల వలన పెళ్లైన తర్వాత సంవత్సరమే అనగా 1976లో సరిత భర్తతో విడిపోయింది. ఆతర్వాత 1988లో మలయాళ నటుడు ముఖేష్ ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు శ్రావణ్, తేజ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. తర్వాత విడాకులు కోరుతూ ముఖేష్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2007లో వీరిద్దరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆతర్వాత ముఖేష్ క్లాసికల్ డ్యాన్సర్ మిథిలి దేవికను పెళ్లి చేసుకున్నారు.
అయితే.. ఆ వివాహం చెల్లదని.. సరిత కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో ఫిర్యాదు చేశారు. విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు తాను దుబాయ్ లో ఉన్నానని.. కోర్టు పంపిన నోటీసులు తాను అందుకోలేదని.. తెలిపారు. ఫలితంగా కోర్టకు హాజరు కాలేకపోయాను. అలా కోర్టు విడాకులు మంజూరు చేసిందని తెలిపారు. ముఖేష్ రెండో వివాహం చెల్లదని కోర్టు తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత, ముఖేష్‌లిద్దరూ 2015 మార్చి 4, గురువారం కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు కోర్టుకు హాజరైన సరిత కోర్టులోనే కళ్లు తిరిగి పడిపోయారు. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. సరిత మాత్రం తన ఇద్దరి కొడుకులతో దుబాయ్ లోనే ఉంటుంది. ముఖేష్ మాత్రం తన కొత్త ఫ్యామిలీతో యర్నాకులంలో ఉంటున్నాడు.
Must Read ;- సౌందర్య జీవితంలోని ‘అసలు మిస్టరీ’ ఇదే!











