మాజీమంత్రి వివేకా కుటుంబాన్ని జగన్ దూరం పెడుతున్నారా ? వివేకా ఆత్మ క్షోభిస్తోందని జగన్ గగ్గోలు పెట్టింది కేవలం అధికారం కోసమేనా ? సొంత చిన్నాన్న వర్ధంతికి సిఎం జగన్ హాజరు కాకపోవడానికి కారణాలు ఏంటి ?
వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య జరిగి ఇవాళ్టికి మూడేళ్లయింది.దీంతో వివేకా మూడో వర్ధంతిని కడప జిల్లా పులివెందులలో ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు.వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఆమె భర్త నారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. అయితే ఈ కార్యక్రమానికి సిఎం జగన్ సహాయ వైఎస్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ హాజరు కాకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి పీఠం కోసం చిన్నాన్న వివేకా హత్యను పావుగా ఉపయోగించుకున్న జగన్ ఆయన మూడవ వ్యర్ధంతికి కనీసం నివాళులు కూడా అర్పించలేదు. 2019 ఎన్నికల సమయంలో వివేకా హత్యకు గురికాగా జగన్ అధికారంలోకి రావడానికి ఈ అంశం ఆయనకు ప్రధాన అస్త్రంగా ఉపయోగపడింది. వివేకా ఆత్మ క్షోభిస్తోంది అంటూ ఆ ఎన్నికల్లో జగన్ గగ్గోలు పెట్టారు. అయితే ఇదంతా జగన్ కేవలం ఓట్ల రాజకీయం కోసం చేసిన హడావుడి మాత్రమే అనే చర్చ జోరుగా సాగుతోంది.
నిజానికి జగన్ అధికారంలోకి రాగానే వివేకా హత్య కేసులో పురోగతి ఉంటుందని అంతా భావించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ఎటూ తేల్చలేదు. దీంతో తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగదని భావించిన వివేకా కుమార్తె మూడేళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు.అయితే వివేకా హత్యకేసులో సిబిఐ దర్యాప్తు కోరుతూ సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించడమే వివేకా కుటుంబాన్ని జగన్ దూరం పెట్టడానికి కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ మూడేళ్ల కాలంలో సీబీఐ దర్యాప్తులో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. హత్యకేసులో నలుగురు పాత్రధారులను గుర్తించిన సీబీఐ… సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు సాగిస్తోంది.హత్య వెనుక అసలు కారణాలు, అసలు కుట్రదారులు ఎవరనేది సిబిఐ వెలికితీస్తోంది. ఈ పరిణామాల వల్లనే వైఎస్, జగన్ కుటుంబం వివేకా కుటుంబాన్ని దూరం పెట్టాయని అందుకే వివేకా వర్ధంతికి జగన్ సహాయ వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదని టాక్. దీంతో నిన్నమొన్నటి వరకు వివేకా కుటుంబం, అవినాష్ కుటుంబ తనకు రెండు కళ్ళు అంటూ బాబాయి మీదప్రేమ వలకపోసిన జగన్.. ఈరోజు అదే బాబాయి వర్ధంతికి నివాళులు అర్పించడానికి హాజరు కాలేదంటే వివేకా హత్య కేసులో సిబిఐ కేసులో ఎంత భయంగా ఉన్నారో అనేది స్పష్టంగా అర్ధమవుతోందని కొందరు చెవులు కోరుక్కుంటున్నారు. అదేసమయంలో 2019 ఎన్నికల్లో వివేకా ఆత్మ క్షోభిస్తోందంటూ గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు ఎవరి ఆత్మ క్షోభిస్తోందో చెప్పాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మొత్తం మీద వివేకా వర్ధంతికి సిఎం జగన్ హాజరు కాకపోవడం పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాల పై ట్రోలింగ్ చేయించిన జగన్ ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వాల్సి వస్తుందనే భయంతోనే వివేకా వ్యర్ధంతికి హాజరు కాలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.
Must Read:-జగన్ ఇంకెన్ని సారా చావులు కోరుకుంటున్నావు – నారా లోకేష్