ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదని పిటిషనర్ వేసిన కేసు వలన పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ నిలిపి వేయాలని హైకోర్టు సింగల్ బెంచ్ తీర్పు ఇవ్వగా…దీనిపై గత వారం ద్వి సభ్య బెంచ్ పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ జరపాలని తీర్పు ఇచ్చింది. ఏపీ లో ఎన్నికలు పక్షపాతంగా నిర్వహిస్తున్నారని, పోలీసు, ఎన్నికల అధికారులు అధికార పక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అరాచకాలకు అధికార పార్టీ పాల్పడుతున్నా కూడా పోలీసు వ్యవస్థ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని పరిషత్తు ఎన్నికలను టీడీపీ పార్టీ బహిస్కరించింది. కాగా అప్పటికే నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థులు చాలా స్థానాలలో పార్టీ పిలుపు మేరకు పోటీ చేయలేదు. దీంతో పరిషత్తు ఎన్నికలలో వైసీపీ ఏక పక్షంగా విజయం సాధించింది.
దుగ్గిరాల టీడీపీదే
కాగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఇంచార్జ్ గా ఉంటున్న మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలంలో ఎంపీపీ స్థానం చేజారి పోయే అవకాశం ఉందని, ఎలాగైనా ఆ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వివరాలల్లోకి వెలితే…18 ఎంపిటిసి స్థానాలు ఉన్న దుగ్గిరాల మండల పరిషత్తుకు 16 స్థానాలు టీడీపీ పోటీ చేయగా.. టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2 స్థానాల్లో పోటీ చేసింది. కాగా ఎన్నికల ముందే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థులైన ఇద్దరిని బెదిరించి లోబరుచుకున్నారు. 16 స్థానాలలో 14 స్థానాలు టీడీపీ , 2 స్థానాలు జనసేన గెలుచుకుంది. ఇప్పుడు దుగ్గిరాల మండల ప్రజా పరిషత్తును వైసీపీ కైవసం చేసుకోవడానికి టీడీపీ అభ్యర్థులను బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం, వైసీపీ క్యాంపు కార్యాలయానికి తరలించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు.
సరికొత్త ఆంక్షలు
కాగా ఎంపీపీ పదవికి పోటీ చేసే వారు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని లింక్ పెట్టి, ఆ పత్రాన్ని జారీ చేసే ఎం ఆర్ ఓ పై ఒక వైపు ఒత్తిడి తెస్తూ.. కార్యాలయంలో కరెంట్ లేదని,ఎంపిపి పదవికి పోటీ చేసే టీడీపీకి చెందిన ముస్లిం ఎంపీటీసీని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాగా గురువారం దుగ్గిరాలలో దాదాపు వెయ్యికి పైగా సీఆర్పీఎఫ్ బలగాలను దించి ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను భయ బ్రాంతులకు గురిచేస్తుందని, కుట్రలు పన్ని అధికార బలంతో దుగ్గిరాల ఎంపీపీని వైసీపీ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న , నారా లోకేష్ ఇంచార్జ్ గా ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల ఎంపీపీని కైవసం చేసుకోవడం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న రాజకీయంలో ఎవరు కైవసం చేసుకుంటారో వేచి చూడాలి.
Must Read ;- టీడీపీ అల్టిమేట్ పోరు.. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్











