ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి చినాబ్ నదిపై నిర్మితమవుతోంది. మరికొద్ది రోజుల్లో వంతెన నిర్మాణ పనులు పూర్తి కానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో తెలిపారు. ఎత్తయిన పర్వతాలు, నదులు, లోయలు ప్రధాన ఆకర్షణగా నిలువనుననాయి. ఇప్పుడు ఇది మరో ఇంజినీరింగ్ అద్భుతానికి వేదిక కానుంది. ఇది దేశంలోనే మొదటి కేబుల్ స్టే ఇండియన్ బ్రిడ్జ్ కావడం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణంలోకి వస్తే జమ్ము, కశ్మీర్ ప్రంతాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. నది ఒడ్డున నిర్మిస్తున్న ప్రపంచంలో ఏడో అతిపెద్ద వంపు ఆకారపు వంతెనగా దీన్ని పేర్కొంటున్నారు.
World Highest Railway Bridge :
బ్రిడ్జ్ విశేషాలివి
359 మీటర్ల ఎత్తులో నిర్మాణం
1250 కోట్ల అంచనా వ్యయం
ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎత్తు
1.315 కిలోమీటర్ల పొడవు
8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత వచ్చే భూ కంపాలను తట్టుకునేలా నిర్మాణం
Must Read ;- కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. రైల్వే కోచ్‌ల కర్మాగారంపై నజర్!











