బెంగళూరులో త్వరలో అందుబాటలోకి రానున్న తొలి సెంట్రలైజ్‌డ్ ఏసీ రైల్వే టర్మినల్ సర్వాంగ సుందరంగా సిద్దమవుతుంది. దీనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ గా పేరు పెట్టారు. ఇది ఈ నెల చివరకు అందుబాటులోకి రానుంది. మరి తొలి సెంట్రలైజ్‌డ్ ఏసీ రైల్వే టర్మినల్ కదా.. ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే మీకు బెంగుళూరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ ను ప్రారంభానికి ముందే ఓ లుక్కెయాలనుందా.. అయితే ఈ చిత్రాలు చూడండి. వావ్ అని నోరెళ్లబెట్టకుండా ఉండలేదు. ఇదేమీ ఎయిర్ పోర్ట్ కాదండీ.. రైల్వే స్టేషనే. ఈ టర్మినల్‌కు సంబంధించిన ఫొటోలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ రైల్వే టర్మినల్‌లో పలు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
Must Read ;- దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ పాలమూరులో
Have a glimpse of the upcoming Sir M. Visvesvaraya Terminal in Bengaluru, Karnataka, equipped with state-of-the-art facilities.
View on Koo: https://t.co/NrovriSqi0 pic.twitter.com/pRwu2zG38O
— Piyush Goyal (@PiyushGoyal) February 18, 2021
బాబోయ్.. ఇన్ని వసతులా..
రూ.314 కోట్ల వ్యయంతో 4,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ ను ఎయిర్‌పోర్ట్‌ను తలపించే రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, రియల్ టైమ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫుడ్ కోర్టు, 4 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ మొదలైనవి ఉన్నాయి. ఈ రైల్వే టర్మినల్‌లో 250 కార్లు, 900 బైకులు, 50 ఆటోరిక్షాలు, 20 క్యాబ్స్, 5 బస్సులను నిలిపివుంచేందుకు సదుపాయంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
Also Read ;- తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల మూత..!











