మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం.. తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’ లో కీలక పాత్ర పోసిస్తున్నాడు. అలాగే.. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు రిలీజ్ డేట్స్ లాక్ అయిపోయాయి. అందుకే వీటిని అనుకున్న టైమ్ లో రిలీజ్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు చరణ్. ఇక ఇప్పుడు మెగాభిమానులందరి దృష్టి రామ్ చరణ్ తదుపరి చిత్రం మీదే ఉంది. అలాగే.. ఆ సినిమాను డైరెక్ట్ చేసేది ఎవరూ అనే విషయంలోనూ బోలెడంత ఆసక్తిగా ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ .. తదుపరి చిత్రాన్ని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. సుమంత్ తో ‘మళ్ళీ రావా’, నానీతో ‘జెర్సీ’ సినిమాలు తీసి.. టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి .. ఇటీవల రామ్ చరణ్ కు పూర్తి స్ర్కిప్ట్ వినిపించాడని .. అతడి సూపర్ నెరేషన్ కు చెర్రీ ఫ్లాట్ అయిపోయాడని టాక్. ‘ఆచార్య, ఆర్.ఆర్.ఆర్’ సినిమాల టాకీ పార్ట్స్ పూర్తయిన వెంటనే .. చెర్రీ.. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నాడని వినికిడి. నిజానికి శంకర్ తో చరణ్ మూవీ అనౌన్స్ అయింది. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. అందుకే చెర్రీ .. గౌతమ్ మూవీ తదుపరి చిత్రంగా చేయబోతున్నాడట.
కేవలం ఎమోషన్స్ తో .. సెన్సిటివ్ స్టోరీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే గౌతమ్ తిన్ననూరి.. చెర్రీతో సినిమా చేయబోతున్నాడు అనగానే.. ఈ సారి ఏ జోనర్ స్టోరీని రాసుకున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఫిల్మ్ వర్గాల వారి సమాచారం ప్రకారం.. గౌతమ్ తిన్ననూరి.. చెర్రీ కోసం ఓ ఎమోషనల్ యాక్షన్ మూవీని రూపొందించబోతున్నాడట. ప్రస్తుతం హిందీలో జెర్సీ సినిమాను తెరకెక్కిస్తున్న గౌతమ్.. ఆ సినిమా కంప్లీట్ అవగానే… చెర్రీ తో తీయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతాడట. మరి చరణ్, గౌతమ్ కాంబో మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Must Read ;- ఆచార్య ఫస్ట్ లిరికల్ : బాస్ ది మామూలు గ్రేస్ కాదు..