జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులు క్లియర్ చేయకుండా, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా… వచ్చిన ఆదాయం, చేసిన అప్పుల సొమ్ము ఎక్కడకు పోతోంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, జగన్‌రెడ్డి ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.29,109 కోట్ల ఆదాయం ఎక్కువొచ్చింది. మరోవైపు 2020-21 ఫిబ్రవరి నాటికే రూ.79,191 కోట్ల అప్పులు చేసి దేశంలోనే అత్యధిక అప్పులు తెచ్చిన రాష్ట్రంగా రికార్డుకెక్కారు. మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది? అన్నింటికీ అప్పులపై ఆధారపడడమంటే దివాళా తీయడం కాదా?’’ అని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు.
Must Read ;- అప్పులు చేయడంలో జగన్‌రెడ్డి రికార్డులు.. లోకేష్ విసుర్లు