మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ వినయ విధేయ రామ. అయితే.. ఈ సినిమా కథ కంటే ముందుగా బోయపాటి రామ్ చరణ్ కి ఓ కథ చెప్పారట. ఆ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా ఉండడం.. యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువుగా ఉండడంతో ఈ కథ తర్వాత చేద్దామనడంతో అప్పుడు వినయ విధేయ రామ స్టోరీ చెప్పడం.. చరణ్ ఓకే అనడంతో ఆ కథను పట్టాలెక్కించడం జరిగింది. అయితే.. వినయ విధేయ రామ ఫ్లాప్ అయినప్పటికీ.. ముందుగా చెప్పిన స్టోరీతో సినిమా చేద్దామని చరణ్.. బోయపాటితో చెప్పేవారట.
ఇప్పుడు రామ్ చరణ్ నో చెప్పిన స్టోరీకే కొన్ని మార్పులు చేసి బోయపాటి కన్నడ స్టార్ హీరో యష్ కి చెప్పారట. ఈ కథకు యష్ ఓకే చెప్పారని సమాచారం. యష్ కి కూడా తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఉంది. గతంలో పూరి డైరెక్షన్ లో యష్ మూవీ అంటూ వార్తలు వచ్చాయి కానీ.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు బోయపాటి డైరెక్షన్ లో యష్ మూవీ పక్కా అంటున్నారు. బోయపాటి ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
దసరాకి అఖండ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆతర్వాత బోయపాటి చేయబోయేది యష్ తోనే అని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ వస్తుంది అంటున్నారు. మరి.. ఈ క్రేజీ భారీ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారో.? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ప్రభాస్ పక్కన ‘బెల్ బాటమ్’ భామ











