మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 8న ప్రారంభించాలి అనుకున్నారు. దీని కోసం శంకర్ హైదరాబాద్లోనే ఉండి లోకేషన్స్ చూడడం.. పాటల రికార్డింగ్ చేయించడం జరిగింది. ఇక సెప్టెంబర్ 8న ఈ పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేస్తారనుకుంటే.. ఇప్పడు వాయిదా పడిందని తెలిసింది. కారణం ఏంటంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఇటీవల ఉక్రెయిన్ లో పాట చిత్రీకరణ జరుపుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి అయ్యింది.
అయితే.. కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉందట. ఇది పూర్తి చేయడానికి చరణ్ 20 డేస్ డేట్స్ కావాలని జక్కన్న అడిగారట. అలాగే.. ఆచార్య కోసం ఓ సాంగ్ చేయాలి. ఇవి పూర్తి చేసిన తర్వాత శంకర్ మూవీ కోసం మేకోవర్ అవ్వాలి. ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది కాబట్టి చరణ్ – శంకర్ మూవీ షూటింగ్ వాయిదా పడిందట. అయితే తాజా సమాచారం ప్రకారం… సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇది చరణ్ కి 15వ చిత్రం కాగా.. దిల్ రాజుకు 50వ చిత్రం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది.
Must Read ;- ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా. ఇది నిజమేనా.?