వంశీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి..!
కృష్ణాజిల్లా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై అనంతపురం జిల్లా, పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వంశీ అంటే ఎవరు? వైసీపీ బీ ఫాం తో గెలిచాడా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైన చంద్రబాబును కించపర్చేలా మాట్లాడారా? అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై చేయకూడని విమర్శలు చేసిన ఒకే ఒక్కడు వల్లభనేని వంశీ అనేవాడు అని శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వాడికి, మాకు ఏం సంబంధం’’ ఉందని ఆయన ప్రశ్నించాడు. అమరావతిలో చంద్రబాబు ఏడిస్తే.. ఇక్కడ పల్లె రఘునాథరెడ్డి గౌరవ సభ అనే పేరుతో ఊర్లపై మీద పడి తిరుగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో కూడా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు వంశీ ఎవరు? మాకేంటి సంబంధమని మీడియా అడిగి ప్రశ్నలకు సమాధానం మిచ్చిన సంగతి తెలిసిందే!
రెంటికి చెడ్డ రేవడిగా మారిని వంశీ పరిస్థితి..!
తెలుగుదేశం పార్టీ బీఫాం తో గెలిచిన వంశీ.. మారుతున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో పార్టీ నుంచి బయటకు వెళ్లాడు. ఏ దృష్టిలో ఆయన పార్టీ మారిన వైసీపీ మాత్రం ఆయనను పార్టీలో చేర్చుకున్నట్లుకానీ, తమ పార్టీలో వంశీ కంటిన్యూ అవుతున్నారని కానీ అధికార వైసీపీ ఎక్కడా ప్రస్తావించలేదు! ఆ నాటి నుంచి మొన్న ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వ్యక్తిగత హననం వరకు వల్లభనేని తన పైత్యాన్ని టీడీపీ ప్రయోగిస్తూనే వచ్చాడు. నోటికి ఎంతమాట వస్తే అంత అనేసి.. జగన్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేయ్యాలని ప్రయత్నం చేశాడు. చివరి ఆయన దుగ్థ ను వైసీపీ నాయకులు బాగానే అణుచుతున్నారు. వల్లభనేనికి మాకు సంబంధంలేదు, అతనికి మా పార్టీ ఏంటి సంబంధం? అని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.
Must Read:-గుడివాడలో హై టెన్షన్.. బోండా ఉమ కారుపై రాళ్ల దాడి! టీడీపీ నేతలు అరెస్ట్!!











