అయితే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ కండవా కప్పుకోలేదు. అంటే వీరంతా ఇప్పటికీ అసెంబ్లీ లెక్కల్లో టీడీపీలో కొనసాగుతున్నట్టు లెక్క. ఈ విషయం ఏ పార్టీకి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయాన్ని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని చదివి వినిపించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పెద్ద సమస్యే వచ్చి పడింది. వారు సభలో నోరు తెరవడానికి వీలు లేకుండా పోయింది.
పార్టీ తరఫునే మాట్లాడాలి
ఏ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫునే అసెంబ్లీలో మాట్లాడాలి టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరూ అసలు సమావేశాలకే హాజరు కాలేదు. చీరాల నియోజకవర్గం టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం, అసెంబ్లీ ఐదు రోజులు జరిగితే ఒక్క రోజు కూడా హాజరు కాలేదు. ఇక విశాఖ నగరానికి చెందిన గణబాబు కూడా సమావేశాలకు హాజరుకాలేదు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిథర్ వచ్చినా చివరి బెంచీల్లో కూర్చొని చిట్ ఛాట్ లకే పరిమితం అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సభలో నోరు తెరవలేకపోతున్నారు. ఒక వేళ వారు మాట్లాడితే టీడీపీ పక్షాన మాట్లాడినట్టే లెక్క. అందుకే పార్టీ మారిన నేతలు సభకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా కాసేపు వెనుక బెంచీల్లో కూర్చొని వెనుదిరగాల్సి వస్తోంది.
Also Read ;- జగనన్న ఫైర్ : బీమా చెల్లింపులతో వారికేం సంబంధం!
రాజీనామా చేసిన తరవాతే మా పార్టీలోకి తీసుకుంటాం…
వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతలో పశువుల మాదిరి కొన్నాడని అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా పార్టీలోకి ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యేలు రావాలంటే, వారు గెలిచిన పార్టీకి రాజీనామా చేసిన తరవాతే తీసుకుంటామని ప్రతి ఎన్నికల సభలో బలంగా వినిపించారు. కానీ టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. టెక్నికల్ గా వారు వైసీపీ సభ్యత్వం తీసుకోవడం కానీ, వైసీపీ కండువా కప్పుకోవడం కానీ చేయలేదు. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో ఎప్పుడు చేర్చుకున్నాం అంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విలేకరులను ఎదురు ప్రశ్నించారు. అంటే వైసీపీ కండవా కప్పులోలేదు కాబట్టి వారు వైసీపీలో చేరినట్టు కాదనే కొత్త నిర్వచనం చెబుతున్నారు.
రెంటికీచెడ్డ రేవడిలా జంప్ జిలానీల పరిస్థితిటీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అటు సభలో మాట్లాడలేరు. ఇక వారి నియోజకవర్గాల్లో నిత్యం టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవలు తప్పడం లేదు. ఈ పంచాయితీలతో గన్నవరం ఎమ్మెల్యే విసిగివేసారిపోయారు. టీడీపీలో ఉండగా తిరుగులేని నేతగా ఉన్న వల్లభనేని వంశీ నేడు ఏ గ్రామానికి వెళ్లినా వైసీపీ కార్యకర్తలు కూడా నిలదీస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాలు నిత్యం ఘర్షణ పడుతున్నాయి. చీరాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆమంచి వర్గం కరణం బలరాం వర్గం ఎవరికి వారే అన్నతీరుగా తయారైంది. ఇక గుంటూరు పశ్చిమలో మద్దాల గిరిథర్ ను పట్టించుకునేవారే కరవయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి వారికి కనీసం వైసీపీ టికెట్ దక్కుతుందన్న నమ్మకం కూడా లేకుండా పోయింది. దీంతో పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కూడా ఆగిపోయాయని తెలుస్తోంది.
Must Read ;- రచ్చ రాజేసిన టిడ్కో ఇళ్లుపై చర్చ











