ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది.. నాలుగేళ్లుగా ఎన్నో మలుపులు తిరుగుతోన్న ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత దూకుడు పెరిగింది.. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసు రోజు నిందితులుగా ఉన్న వారి కాల్ లిస్ట్ లీక్ చేసింది సీబీఐ. వివేకా హత్య ముందురోజు సాయంత్రం నుండి ఆ తర్వాత రోజు ఉదయం వరకు ఎవరెవరు ఎంతసేపు, ఏయే నెంబర్లకు మాట్లాడారో మొత్తం బయటపెట్టింది.. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారుతోంది.. వైసీపీలో బీపీ పెంచుతోంది..
వైఎస్ అవినాష్.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, ఉదయ్ కుమార్ రెడ్డి కాల్ లిస్ట్ ని ఒక గ్రాఫిక్ ప్రెజెంటేషన్ వేసి మరీ రిలీజ్ చేసింది సీబీఐ.. దీంతో, వివేకా హత్య రోజు ఏం జరిగిందో చెప్పకనే చెప్పినట్లయింది.. వివేకా హత్యలో వీరిదే కీలక పాత్ర అని ఇప్పటికే జనాలలో ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాలకు సమీపంలోనే తాజాగా సీబీఐ రిలీజ్ చేసిన కాల్ లిస్ట్ ఉండడం విశేషం.
అయితే, సీబీఐ ఈ కాల్ లిస్ట్ లో ఇద్దరి పేర్లను ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఈ అంశంలో సీబీఐ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా…?? అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతి సహాయకులు నవీన్, కృష్ణ మోహన్ రెడ్డి..
వివేకా హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి హైదరాబాద్కు కాల్ చేశారు. హైదరాబాద్లోని జగన్ నివాసంలో పని చేసే నవీన్, కృష్ణమోహన్ రెడ్డికి పలు మార్లు ఫోన్ చేశారనే గతంలోనే సీబీఐ లీక్ చేసింది.. ఇప్పటికే వారి కాల్ లిస్ట్ కూడా ఉండడంతో సీబీఐ వారిని పిలిచి పిలిచి ప్రశ్నించింది. కడపలో జరిగిన విచారణకు వీరిని సీఎస్ జవహర్ రెడ్డి తీసుకొచ్చి తీసుకెళ్లారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వారి ఫోన్లకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసింది నిజమేనని.. వివేకా చనిపోయారని చెప్పేందుకు చేశారని అందులో తప్పేముందని సజ్జల కూడా మీడియా ముందు వాదించారు. ఆ ఫోన్లను జగన్, భారతి మాట్లాడారని సజ్జల కూడా క్లారిటీ ఇచ్చినట్లయింది.
అయితే సీబీఐ మాత్రం ఈ ఫోన్ కాల్స్ విషయాన్ని పక్కన పెట్టేసింది. అఫిడవిట్లో స్కెచ్ల రూపంలో చూపించిన దాంట్లో వీరి ఫోన్ కాల్స్ ని బయటపెట్టలేదు.. ఇదే ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాలలో విస్మయం వ్యక్తమవుతోంది. అయితే, సీబీఐ ఈ అంశంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని కొందరు ఎనలిస్టులు చెబుతున్నారు.. ఇది అవినాష్ రెడ్డి బెయిల్ తిరస్కరించాలని దాఖలు చేసిన అఫిడవిట్ మాత్రమేనని, అందుకే నిందితుల కాల్ లిస్ట్ ని మాత్రమే హైలైట్ చేసింద,ఇ అభిప్రాయ పడుతున్నారు.. అసలు విషయం వేరే చార్జిషీట్లలో ఉంటుందని మరికొంత మంది వాదిస్తున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ.. నవీన్, కృష్ణమోహన్ రెడ్డి కాల్స్ గురించి సీబీఐ చెప్పకపోవడం.. హాట్ టాపిక్ అవుతోంది. మరి, ఈ కేసు రాబోయే రోజులలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.