1 రోజుకి వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందిన జీతం ఎంతో తెలుసా.?? 50 లక్షల రూపాయలు.. అంటే రోజుకి అందులోనూ ఆయన హాజరయింది రెండు మూడు గంటలు కూడా లేవు.. దీని కోసం ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించిన సొమ్ము అక్షరాలా యాభై లక్షల రూపాయలు.. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం..
ఈ లెక్క ఏంటనుకున్నారా.?? పులివెందుల ఎమ్ఎల్‌ఏగా వైఎస్ జగన్‌కి అసెంబ్లీకి హాజరయ్యేందుకు చెల్లిస్తున్న జీతం ఇది.. అవును, ఇది నిజం. పులివెందుల ఎమ్‌ఎల్‌ఏగా విజయం సాధించిన జగన్… తనకి ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ప్రభుత్వం అందజేస్తున్న జీతం లెక్కలు అవి…. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఒక్క రోజు కూడా బాధ్యతగా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.. ఇప్పటివరకు ఆయన రెండు రోజులు అసెంబ్లీలో అడుగుపెట్టాడు. కానీ, ఒక్క రోజు మాత్రమే సభకు హాజరయ్యాడు. మొదటి రోజు ఎమ్‌ఎల్‌ఏగా ప్రమాణ స్వీకారం చేయడానికి.. ఇక రెండవ రోజు, వరసగా మూడు శాసన సభ సమావేశాలకు లేదా 60 రోజులు స్పీకర్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయితే ఆయన శాసనాసభ సభ్యత్వం రద్దవనుందనే భయంతోనే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారనేది వాస్తవం..
మొదటి రోజు ప్రమాణస్వీకారాన్ని సాంకేతికంగా మినహాయించవచ్చు.. అంటే, జగన్ హాజరయింది కేవలం ఒకే ఒక్క రోజు.. ఒక్క రోజుకి జగన్ ఇప్పటివరకు అందుకున్న జీతం సుమారు 50 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఓటమి తర్వాత కేవలం రెండు రోజులు మాత్రమే సభకు హాజరయ్యారు.. దీనికోసం ఆయన అందుకున్న జీతం 57 లక్షల రూపాయలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.. ఈ లెక్కన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 50 లక్షల వరకు అందుకున్నారని భావిస్తున్నారు..
ప్రజలు ఓటు వేసి వారి సమస్యలు, సాధక బాధకాలు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని, తన దగ్గర ఏవయినా సూచనలు, సలహాలు ఉంటే అందజేయాలని జగన్‌ని పులివెందుల ప్రజలు గెలిపిస్తే, ఆయన మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతానని కండిషన్లు పెడుతున్నారు.. ఎమ్‌ఎల్‌ఏగా హాజరయ్యేది లేదని బీరాలు పోతున్నారు.. అలా అని ఆయన ప్రజల నిధులను దుర్వినియోగం చేయకుండా, వాటిని సద్వినియోగం చేయడానికి జీతం తీసుకోకుండా ఉంటే సరిపోతుంది..
జగన్ మాత్రం ఫ్రీగా వస్తుంది కదా అని యాభై లక్షల రూపాయలను తన అకౌంట్‌లో వేసుకున్నారని తెలుస్తోంది.. అంటే, క్షణం సమయం ప్రజల కోసం వెచ్చించకుండానే, వారి సమస్యలు ప్రస్తావించకుండానే ఆ సొమ్ముని జేబులో వేసుకున్నారనుకోవాలి.. మరి, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేంత వరకయినా, ఆయన ఈ జీతాన్ని వెనక్కి డిపాజిట్ చేస్తారా..?? లేదా..??