నాటుసారా మృతుల అంశంలో వైసీపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోగా, పర్యటనను విఫలం చేసేందుకు వైసీపీ యత్నాలు చేస్తోంది. నాటుసారా మృతుల కుటుంబాలను చంద్రబాబు కలవకుండా వ్యూహం పన్నుతున్నారు. ఈ నేపధ్యంలో బాధితులు ఏలూరు కలెక్టరేట్‌కు వెళ్లాలని అక్కడ 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తారని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అధికారులు, వైసీపీ నేతలు, వాలంటీర్లు బాధితుల ఇళ్లకు వెళ్లి ఏలూరు వెళ్లాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు తమను పట్టించుకోలేదని, మొదటి నుంచి టిడిపి నేతలు మాత్రమే తమకి అండగా ఉన్నారని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నారు. అదేసమయంలో ఏలూరు వెళ్లమని, చంద్రబాబును ఖచ్చితంగా కలుస్తామని బాధితులు అధికారులకు తెగేసి చెబుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పర్యటన నేపధ్యంలో జంగారెడ్డిగూడెం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు భారీగా మోహరించారు.పోలీస్ పీకెట్ ఏర్పాటు చేసిన పోలీసులు చంద్రబాబు పర్యటనకు వస్తున్న టీడీపీ నాయకులని, కార్యకర్తలను ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు.
Must Read:-చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసిపి కుట్రలు..











