వైసీపీ అధిష్టానానికి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరావు జిల్లాల సమన్వయ కర్త పదవికి రాజీనామా చేశారు.. ఆయన రాజీనామా వైసీపీలో దుమారం రేపింది. గత కొంతకాలంగా పార్టీ హై కమాండ్పై గుర్రుగా ఉన్న ఆయన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల సమన్వయ కర్త బాధ్యతల నుండి తప్పుకున్నారు.. ముఖ్యమంత్రికి దగ్గరి బంధువు అయిన బాలినేని తప్పుకోవడంపై పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. బాలినేనిని బుజ్జగించాలని జగన్ ప్రయత్నించినా, ఆయన లైట్ తీసుకున్నారని సమాచారం..
మరోవైపు, బాలినేని రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేట్ అయినా లేటెస్ట్ గా స్పందించారు.. ఆయన రాజీనామాకి అసలు కారణం ఏంటో బయటపెట్టారు.. వైసీపీలో ఓటమి భయం మొదలయిందని, బాలినేని తప్పుకోవడానికి అసలు కారణం అదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికలకు ఏడాది ముందే వైసీపీ నేతలు ఓటమి భయంతో ఉన్నారని అభిప్రాయ పడ్డారు చంద్రబాబు..
వైసీపీ నేతలు కొందరు అప్పుడే కాడి పడేస్తున్నారు. మరికొందరు పోటీకి దూరంగా ఉంటామని చెబుతున్నారు.. మరికొందరు బాధ్యతల నుండి తప్పుకుంటున్నారు.. ఆ పార్టీ ఓడిపోతోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు చంద్రబాబు.. అయితే, ఈ వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేశారో అని డీకోడ్ చేసే ప్రయత్నంలో మునిగిపోయింది వైసీపీ..
గత కొంతకాలంగా వైసీపీలో సైలెంట్ గా ఉంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.. అంటే, ఆయన కాడి పడేశారని చెబుతున్నారు.. ఇక రాబోయే ఎన్నికలలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు పోటీ చేయబోమని, తమ వారసులకు చాన్స్ ఇవ్వాలని జగన్ ముందు అప్లికేషన్ లు పెట్టుకున్నారు… ఓటమి భయంతోనే ఈ నేతలంతా తమ వారసులను తెరముందుకు తెస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.. ఇటు, తాజాగా ఇదే రూట్ లో బాలినేనికి సైతం ఓటమి భయం పట్టుకుందనేది చంద్రబాబు భావన..
టీడీపీ అధినేత ఇంత విశ్లేషించినా, సంచలన కామెంట్స్ చేసినా.. వైసీపీ నుండి కనీసం కౌంటర్ రాకపోవడం విశేషం.. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఇదే చర్చనీయాంశం అవుతోంది.. ఆ పార్టీ ఓడిపోతోందన్నా, ఆ పార్టీ నేతలు కాడి పడేస్తున్నారని ఎటాక్ చేస్తున్నా… వైసీపీ సీనియర్ నేతలు సైతం ఎదురు దాడి చేయడం లేదంటే.. పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.. ఎన్నికలకు ఏడాది ముందే పరిస్థితి ఇలా ఉంటే… రాబోయే రోజుల్లో ఆ పార్టీ నుండి కనీసం కౌంటర్ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి, జగన్.. వీటికి ఎలాంటి కౌంటర్ వ్యూహం రచిస్తాడో చూడాలి..