స్వరం మారుతోంది.. స్టాండ్ మార్చడం!
ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు అంశం తీవ్ర ఆందోళనలకు దారి తీస్తున్నాయి. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, విజయనగరం వంటి జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై రోజురోజుకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అక్కడక్కడ రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో కూడా స్థానిక ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ నేతలకు కూడా జిల్లా పునర్విభజనపై పెదవివిరుస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరును కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి లు తమ గళాలను విప్పారు.
విభజనతో ఘర్షణలు తప్పవు..
అశాస్త్రీయంగా జిల్లాలను విభజించడం కారణంగా భవిష్యత్తులో ఘర్షణలు తప్పవని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరించారు. జిల్లాల విభజన అసాంతం అశాస్త్రీయంగా జరిగిందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమశిల, కండలేరు జలాశయాల నీటి పంపకాల్లో వివాదాలు తలెత్తకమానవని జోష్యం చెప్పారు. రావూరు, కలువాయి, సైదాపురం ప్రజలు నెల్లూరులోనే ఉంచాలని సూచించారు. ఈ మూడు మండలాలు బాలజీ జిల్లాలో చేర్చడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన, నియోజకవర్గాల పునర్విభజనలో జరిగిన నష్టాన్ని భరించామని, మూడోసారి నష్టం జరిగితే భరించలేమని స్పష్టం చేశారు. మరోవైపు నగరిని బాలాజీ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. జిల్లాలా పునర్విభజపై ఆమె స్పందించారు. విభజనతో నగరి నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కొత్తగా ఏర్పడే బాలజీ జిల్లాలో నగరిని కలపాలని కోరారు.
Must Read:-ముందుస్తుకు పోతే ముప్పు వైసీపీకే! తనగొయ్యి తానే తవ్వుకుంటున్న జగన్!!











