మహాత్మాగాంధీ ముని మనమరాలు ఆశిష్ లతా రామ్ గోబిన్‌కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.వ్యాపారి ఎస్ ఆర్ మహారాజ్‌ను ఆశిష్ లతా రామ్ గోబిన్ మోసం చేసినట్టు కోర్టు విచారణలో తేలింది.భారత్ నుంచి దక్షిణాఫ్రికా వచ్చే కన్‌సైన్‌మెంట్‌కు కస్టమ్స్ పన్నులు చెల్లించేందుకు మహారాజ్ ఆమెకు అడ్వాన్సుగా రూ.3.23 కోట్లు చెల్లించారు. అయితే ఆ కన్‌సైన్‌మెంట్ నుంచి వచ్చే లాభాల్లో కొంత మొత్తం ఆయనకు లభిస్తుంది. అయితే అటువంటి కన్‌సైన్‌మెంటు ఏదీ లేదని అది నకిలీ బిల్లని తేలింది. దీంతో మహారాజ్ ఆమెపై మోసం కేసు నమోదు చేశారు. ఆమెపై 2015లోనే ఈ కేసు నమోదవగా అప్పటి నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. తాజాగా నిన్న కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది.
మహాత్మాగాంధీ పేరు మంట కలిపారు
మహాత్మాగాంధీ ముని మనమరాలు ఆశిష్ లతా లేని కన్‌సైన్‌మెంటు ఉన్నట్టు చూపి మహారాజ్‌ను మోసం చేసి అతని వద్ద నుంచి పెద్ద మొత్తం వసూలు చేశారని 2015లో కేసు నమోదైంది. అప్పట్లోనే ఆమె 50 వేల ర్యాండ్లు పూచీకత్తుగా ఉంచి బెయిల్‌పై విడుదల అయ్యారు.మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా ఎంతో మంది పేదలకు సాయం చేశారు. అక్కడే ఆమె ముని మనమరాలు మోసం కేసులో జైలు పాలవడం చర్చనీయంశంగా మారింది.
Must Read ;- డ్రగ్స్ తరలిస్తున్న మహిళల పట్టివేత.. రూ.126 కోట్ల హెరాయిన్ స్వాధీనం











