టీఆర్ఎస్ ను చావు దెబ్బకొట్టి … దుబ్బాకలో జయకేతనం ఎగరవేసిన బీజేపీ నియోజక వర్గం అభివృద్దిపై దృష్టి సారించింది. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మండలాలు, గ్రామాల వారిగా పర్యటనలు నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్ ఇక యాక్షన్ ప్లాన్ కు సిద్దమవుతున్నారు . నియోజక వర్గం అభివృద్ది కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం , ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పని ప్రారంభించబోతున్నట్టు ఆయన చెబుతున్నారు. మూడు వైపు ల ఉన్న నియోజక వర్గాలు అభివృద్ది చెందుతున్నా దుబ్బాక మాత్రం వెనకబడి పోయి ఉందని మొదటి నుండి చెబుతున్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావ్. నియోజక వర్గ అభివృద్దే లక్ష్యంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం హరీష్ రావుకు ధీటుగా ప్రచార కర్యక్రమాలు నిర్వహించి గెలుపొందారు. దీంతో ఎన్ని ఎబ్బందులనైనా ఎదుర్కొని తానిచ్చిన హామీలను నెరవేరుస్తానంటూ ధీమాగా చెబుతున్నారు.
అధికారులే మొదటి టార్గెట్..
నియోజక వర్గ అభివృద్దికి సంభందించి ఇప్పటికే పూర్తి స్థాయి సమచారం తెప్పించుకున్నాడు రఘునందన్ రావ్. అధికారుల పనితీరుతో పాటు వారి అలసత్వంతోనే అభివృద్ది కుంటు పడుతుందని భావిస్తున్నాడురఘునందన్ రావ్. ఇప్పటికే అదికారులతో పలుమార్లు సమావేశం నిర్వహించిన రఘునందన్ రావ్ నిలిచిపోయిన అభివృద్ది పనులపై ఆరాతీసారు. ఒకే జిల్లాలో వేరువేరు నియోజక వర్గంలో అభివృద్దిలో వెనకబాటు తనానికి గల కారణాలు తెలపాలంటూ ఆయన అదికారులను ప్రశ్నిస్తున్నారు.
అదికారుల అలసత్వం వల్లే దుబ్బాకకు రావాల్సిన నిదులు పక్కదారి పడుతున్నాయని.. రోడ్ల అభివృద్ది, ప్రభుత్వ భవనాలు, బస్టాండ్ వంటి నిర్మాణాలు పూర్తిగా పాడుబడి పోవడంతో ప్రజలు ఇబ్బదులు ఎదుర్కొంటున్నారంటూ రఘునందన్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలను వ్యక్తిగతంగా కలిసి ధన్యావాదాలు తెలిపిన రఘునందన్ రావ్ ఇక సమీక్షలు ఏర్పాటు చేసి నియోజక వర్గంలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తా అంటున్నారు.
Must Read ;- మరోసారి బీజేపీ ట్రాప్‌లో టీఆర్ఎస్..?
మల్లన్న సాగర్ పర్యటన .. అనంతరం మంత్రులను కలిసే యోచనలో ఎమ్మెల్యే..
ఉప ఎన్నికల్లో మల్లన్న సాగర్ మండలం లో రఘునందన్ కు ఓట్లు చాలా తక్కువగా వచ్చాయి. అక్కడ స్థానిక నేత చెరకు శ్రీనివస్ రెడ్డి అబ్యర్థిగా నిలబడటం అది ఆయన సొంత మండలం కావడం తో రఘునందన్ కు ఓట్లు పెద్దగా రాలేదు. దీంతో ఆయన దీనిపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. సమస్యల పరిష్కారం ఏమిటన్నదానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు
రఘునందర్ రావ్. ఆ తరువాత శాఖల వారిగా మంత్రులను కలిసి నియోజక వర్గం అభివృద్దికోసం నిదులు విడుదల కోసం ఒత్తిడి తెస్తా అంటున్నారు. దుబ్బాక నియోజక వర్గాన్ని గతంలో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించాయని.. నిదులు విడుదల అవుతున్నా నియోజక వర్గం వరకు రానియ్యకుండా అడ్డుకుంటున్న వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి తగిన బుద్ది చెబుతా అని హెచ్చరిస్తున్నారు. మరి రఘునందర్ రావ్ ప్లాన్ ఏమేరకు వర్కౌట్ అవుతుంది… రాష్ట్ర ప్రభుత్వం ఆయన డిమాండ్ లను ఏమేరకు తీరుస్తుందో చూడాలి.











