యువ కథానాయకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం విష్వక్సేన్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఆయన నుంచి ఇంతవరకూ వచ్చిన నాలుగు సినిమాలు ఇదే విషయాన్ని నిరూపించాయి. ఐదో సినిమా కూడా అదే బాటలో నడవనుంది. విష్వక్సేన్ ఐదో సినిమాగా ‘పాగల్‘ రూపొందింది. బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ద్వారా, నరేశ్ కొప్పల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రధన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, సిమ్రాన్ చౌదరి కథానాయికగా అలరించనుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. “ఏయ్ .. ఎవడ్రా నా లవర్ ను ఏడిపించింది” అంటూ ఓ కుర్ర గ్యాంగ్ కు హీరో వార్నింగ్ ఇవ్వడంతో ఈ టీజర్ మొదలవుతోంది. లవ్ .. యాక్షన్ ప్రధానంగా సాగే సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. పేరుకు తగినట్టుగానే విష్వక్సేన్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ టీజర్ ను వదిలారు. విష్వక్సేన్ మాస్ లుక్ తో .. మాస్ డైలాగ్స్ తో, ఈ సినిమా ఏ వర్గం ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారనే విషయాన్ని చెప్పేశాడు.
ఒక వైపున మనసంతా ప్రేమతో నిండిన యువకుడిగా .. మరో వైపున తను ప్రేమిస్తున్న అమ్మాయిని దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న కుర్రాడిగా విష్వక్సేన్ ఈ టీజర్లో కనిపిస్తున్నాడు. గతంలో కంటే హ్యాండ్సమ్ గానే అనిపిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కథానాయికగా సిమ్రాన్ చౌదరి పరిచయమవుతుండగా, మురళీ శర్మ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. విష్వక్సేన్ సినిమా అనగానే అది ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు ఒక ఐడియా ఉంది. అందుకు అంగుళం అటూ ఇటు కాకుండా ఈ సినిమా ఉటుందనే విషయం అర్థమవుతోంది. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా టీజర్ చివర్లో చెప్పేశారు.
Must Read ;- కండలవీరుడిగా కార్తికేయ.. మరి మంచి కబురు తెస్తుందా?











