యంగ్ రెబల్ స్టార్ , పాన్ ఇండియా స్టార్ లాంటి బిరుదులతో .. డార్లింగ్ ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానుల చేత ఆరాధింపబడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అసలు మేటర్లోకొస్తే .. ప్రభాస్ కు ముందు నుంచీ కార్లంటే కాస్త మక్కువ ఎక్కువే. అందులోనూ మార్కెట్లోకి ఎలాంటి ఖరీదైన కొత్త వారు వచ్చినా.. దాని మీద మోజుతో తన సొంతం చేసుకోవడం మనోడికి హాబీ. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇప్పుడు రూ. 5 కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది.
ఇంతకీ ప్రభాస్ ఖరీదు చేసిన ఆ కొత్త కారు పేరేంటో తెలుసా? లంబోర్గినీ అవెంటడార్ యస్.రోడ్ స్టర్. ఆ కారును కొనుగోలు చేసిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ అతడే కావడం విశేషం. ఇటీవల తారక్ కూడా లంగోర్గిని లో మరో మోడల్ కార్ కొన్న సంగతి తెలిసిందే. అలాగే.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా ఇటీవలే లంగోర్గిని కార్ కొన్నాడు. ప్రస్తుతం ఇండియన్ స్ర్కీన్ మీదే అత్యధిక పారితోషికం అందుకొనే ప్రభాస్ .. త్వరలోనే హైద్రాబాద్ లో తన ఖరీదైన కార్ లో విహారానికి వెళ్ళనున్నాడు.
Also Read:రెబెల్ స్టార్ తో యంగ్ రెబల్ స్టార్ అడుగులు











