మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాను, అలాగే.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను ఎటే టైమ్ పట్టా లెక్కిస్తున్నాడు. ‘ఆచార్య’ సినిమాలోని అతడి పార్ట్ చిత్రీకరణ పూర్తి అవడంతో .. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీపైనే పూర్తి దృష్టి పెట్టాడు. దీని తర్వాత చెర్రీ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరిలో ఈ సినిమాను బహుభాషల్లో విడుదల చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.
ఇక చెర్రీ, శంకర్ కాంబో మూవీ అనౌన్స్ అయిన రోజు నుంచీ .. వస్తున్న ప్రతీ అప్డేట్ అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఇదొక పాలిటికల్ థ్రిల్లరని, ఇందులో చెర్రీ ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడని, ఒక విధంగా ఇది ‘ఒకే ఒక్కడు’ సినిమాకి సీక్వెల్ లాంటిదని.. ఇలా రకరకాల అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఇందులో ఒక పాత్ర 70 ఏళ్ల వయసుతో కనిపిస్తుందట. అంతేకాదు ఆ పాత్రే ఇందులో ముఖ్యమంత్రట. అలాగే.. మరో పాత్ర యువ రాజకీయ వేత్తగా కనిపిస్తుందట. అయితే ఇందులో ముఖ్యమంత్రి పాత్ర మాత్రం ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ అవుతుందట. ఈ రెండు పాత్రల్ని దర్శకుడు శంకర్ ఓ రేంజ్ లో ఎలివేట్ చేయబోతున్నాడట. అంతేకాదు ఇందులో చెర్రీ ఓల్డ్ గెటప్ పై శంకర్ ఎంతో శ్రద్ధ పెడుతున్నాడట.
గతంలో నాయక్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయమే సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు చెర్రీ మరో సారి డ్యూయల్ రోల్ చేయబోతుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమా రామ్ చరణ్ కు ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- బాలీవుడ్ లోకి వెళుతోన్న శంకర్ ‘అపరిచితుడు’











