April 17, 2026 8:18 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

బురద రాజకీయం : న్యాయపీఠంపై వైసీపీ అక్కసు!

హైకోర్టు న్యాయమూర్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యుద్ధం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో అనుచితమైన సంబంధం ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ మళ్లీ కొత్తగా బురద చల్లుతోంది. విషప్రచారానికి ఒడిగడుతోంది.

September 18, 2020 at 12:15 PM
in Andhra Pradesh, Latest News, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అర్థసత్యాలతో ఎదుటివాడిని మోసం చేయడం, తద్వారా అనుచిత లబ్ధిని పొందడం అనేది ఇవాళ కొత్తగా మొదలైన సంస్కృతి కాదు. కురుక్షేత్రంలో ధర్మరాజుగా పేరున్న యుధిష్టరుడు ‘అశ్వత్థామ హతః’ అని పెద్దగానూ, ‘..కుంజరః’ అని చిన్నగానూ అన్నప్పుడే ధర్మం, న్యాయం మంటగలిసిపోయాయి. ఇక మనమెంత? తమకు పనికి వచ్చే భాగాన్ని మాత్రం ప్రచారంలో పెట్టి.. దానికి అసలుకంటె భిన్నమైన అర్థం వచ్చేలా ప్రజల మనసుల్లోకి నెట్టి..  అనుచితమైన ప్రయోజనం ఆశించడం రాజకీయనాయకులకు చాలా మామూలు సంగతి. కాకపోతే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్.. ఇలాంటి దుర్నీతిని పరాకాష్టకు తీసుకువెళ్తోంది. ఏకంగా న్యాయవ్యవస్థ మీదే, న్యాయమూర్తుల మీదే విషప్రచారానికి తెగబడుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు యుక్తాయుక్త విచక్షణకు నీళ్లొదిలేశారు. మసిగుడ్డ కాల్చి తమకు కిట్టని వారి మొహాన వేయడం వరకే తమ పని.. అంటిన మసిని కడుక్కుని, శుభ్రం చేసుకోవడం అవతలి వారి ఖర్మ, వారి ప్రారబ్ధం అన్న తీరుగా వారి వ్యవహార సరళి ఉంటోంది. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలకు హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు వస్తున్నాయి. వరుసగా ఇలాగే జరుగుతూ ఉంటే, ఎవరైనా సరే… తమ నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుంటారు. కానీ.. జగన్ సర్కారు మాత్రం ప్రతిసారీ సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడ కూడా తిరస్కరణకు గురవుతూనే ఉంది. అందుకే కొత్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేసింది. 

న్యాయమూర్తులపైనే విష ప్రచారం

తమ పార్టీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వానికి ఆటంకాలు కలిగిస్తున్నారని తలపోశారో ఏమో గానీ.. ఏకంగా న్యాయవ్యవస్థ మీదనే దాడికి దిగారు. సీఆర్డీఏ లావాదేవీల గురించి ఏసీబీకి అప్పగించిన కేసు విచారణ మీడియాలో రాకూడదని కోర్టు నిషేధాజ్ఞలు జారీచేసిన వెంటనే వారికి ఆగ్రహం వచ్చింది. హైకోర్టు నిర్ణయంపై పార్టీ నాయకుడు సజ్జల రామక్రిష్ణా రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈలోగా.. ఇంకాస్త జాగ్రత్తగా.. చంద్రబాబునాయుడుకు అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నాటుకునేలా.. ఒక విష ప్రచారానికి తెరతీశారు. 

హైకోర్ట్‌పై డైరెక్ట్ వార్ ప్రకటించిన జగన్ సర్కార్!

అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీయే వివిధ అధికార, ఉద్యోగ సంఘాల వారికి నివాస స్థలాలను విక్రయించింది. ఇది పూర్తిగా విక్రయం! ఆ క్రమంలో న్యాయమూర్తులు కూడా ఒక సొసైటీగా ఏర్పడి ఇంటి నివాస స్థలాలు కొనుగోలు చేశారు. ఆ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు తాము కొత్తగా కనిపెట్టినట్టుగా బయటకు తెచ్చింది. 

13 మంది హైకోర్టు న్యాయమూర్తులు అప్పట్లో సీఆర్డీయే నుంచి ఇంటిస్థలాలు కొనుగోలు చేశారు. దీనిని చంద్రబాబు నాయుడు వారికి నివాస స్థలాలు కేటాయించినట్లుగా తాజాగా ప్రచారంలోకి తెచ్చింది. న్యాయమూర్తులు.. ప్రభుత్వం నుంచి ఇలాంటివి ఏవీ పొందకూడదంటూ నీతులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ వల్లిస్తోంది. పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలా జరిగిందంటూ వక్రభాష్యాలు చెబుతోంది. ఎప్పుడో జరిగిన నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ మాత్రమే గత ఏడాది ఏప్రిల్ 24న జరిగింది. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు మరో అంశాన్ని బయటకు తీశారు. అదివరలో గుజరాత్ లో  న్యాయమూర్తులకు ఇంటిస్థలాలు కేటాయించిన వ్యవహారంలో వారికి నోటీసులు వెళ్లడం గురించి ప్రస్తావించారు. అయితే అక్కడ కూడా వారు అర్థ సత్యాలను మాత్రమే ప్రచారంలో పెట్టి.. న్యాయ వ్యవస్థ మీద బురద చల్లేందుకు సాహసించారు. 

గుజరాత్ లో 27 మంది న్యాయమూర్తులు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధరలకు చౌకగా స్థలాలు తీసుకున్నారు. అలా తీసుకోవడం మాత్రమే కేసు అయింది. అయితే అమరావతి విషయంలో.. న్యాయమూర్తులు గజం 5000 వేల రూపాయల వంతున ధర చెల్లించి కొనుగోలు చేశారు. అందులో కొందరు బ్యాంకు లోన్లు తీసుకుని మరీ ఈ స్థలాలు కొన్నారు. ఇంకొక తేడా కూడా గమనించాలి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో అత్యంత పోష్ ఏరియాగా పరిగణించే గోటా ఏరియాలో జడ్జిలకు ‘సబ్సిడీ ధరలకు’ విక్రయించడం మాత్రమే వివాదం అయింది. అయితే ఇక్కడ అమరావతి పరిస్థితి ఏమిటి? వారు కొన్న సమయానికి అక్కడ రాజధాని వస్తుందనే మాట తప్ప.. అదేమీ అభివృద్ధి చెందిన నగరం కాదు. అయినప్పటికీ వారు ఎకరం 5000 రూపాయల వంతున డబ్బు పెట్టి కొన్నారు. అప్పటికి అదేమీ చవక ధర కాదు. ఎందుకంటే.. 

అదే అమరావతి ప్రాంతంలో చంద్రబాబునాయుడు అమృత, వీఐటీ లాంటి యూనివర్సిటీలకు కూడా స్థలాలు కేటాయించారు. ఆ స్థలాలను ఎకరా యాభైలక్షల వంతున ఒక్కొక్కరికి 200 ఎకరాలు విక్రయించారు. అదే ధర ప్రకారం గణించి చూస్తే ఒక్కో గజం గరిష్టంగా 1100 రూపాయలు పడుతుంది. అలాంటిది న్యాయమూర్తులు గజానికి రూ.5000 చెల్లించి కొనుగోలు చేస్తే అది తప్పెలా అవుతుంది? 

నిజానికి ఈ స్థలంలో ఈ 13 మంది న్యాయమూర్తులు మాత్రమే కాదు.. 200 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా అదే ధర చెల్లించి ఇంటిస్థలాలు కొన్నారు. కానీ ప్రస్తుతానికి న్యాయవ్యవస్థ మీద బురద చల్లడం ఒక్కటే వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యం గనుక.. న్యాయమూర్తులు స్థలాలు కొన్న సంగతిని మాత్రం బయటపెట్టి వివాదం రేపుతున్నారు.ఎన్జీవోలకు, గజిటెడ్ అధికారులకు అంతకంటె తక్కువ ధరకే స్థలాలను విక్రయించారు. ఆ రకంగా చూసినప్పుడు ఈషా ఫౌండేషన్ కు కేవలం 10 లక్షల రూపాయలకు ఎకరం వంతున 10 ఎకరాలు కేటాయించారు. 

ఎకరం 10 లక్షలు అనేది కనీస ధరగా లెక్కిస్తే ఒక్కో గజం.. 200 రూపాయల పైచిలుకు మాత్రమే పడుతుంది. అలాంటిది గజానికి 5000 రూపాయలు చెల్లించడం అంటే.. ఎకరం విస్తీర్ణానికి 2 నుంచి 2.5 కోట్లరూపాయలు వెచ్చించి కొన్నట్టు లెక్క. ఇందులో అవినీతి, అనుచితంగా కట్టబెట్టడం, అక్రమం, అరాచకం ఏమున్నదో ఎవ్వరికీ అర్థ: కాని సంగతి. 

ఈ మాత్రం లాజిక్ వైసీపీ మేధావులకు తెలియదని కాదు. కానీ.. వారి ఎజెండా వేరు. న్యాయవ్యవస్థ మీద బురద చల్లడం, న్యాయమూర్తులు చంద్రబాబునాయుడు కు అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రజల్లో అపోహ కలిగించడం, అనుమానాలు పుట్టించడం మాత్రమే. అందుకే ఇలాంటి విషప్రచారానికి తెరలేపారు. 

ఏం సాధిస్తారు?

న్యాయమూర్తుల మీద బురద చల్లుతూ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికలపై ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లింది. ఇలాంటి అర్థసత్యాలు, అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా వారి లక్ష్యం ఏమిటో అంతుచిక్కని సంగతి. ఒక అసత్యాన్ని వారు ప్రచారంలోకి తెచ్చినంత మాత్రాన.. దేశం కళ్లు మూసుకుని వారు చెప్పేదే విని, నమ్మే పరిస్థితి ఇవాళ్టి రోజుల్లో లేదు. సత్యం ఎంతోకాలం దాగదు. 

ఒక్కరోజు అసత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో వారు సఫలం కాగలరేమో గానీ.. ఆ అసత్యంతో ప్రజలందరినీ నమ్మించగలరనుకోవడం భ్రమ. అసలు సత్యం వెలుగు చూసినప్పుడు.. వీరు చెప్పిన అసత్యాన్ని నమ్మిన ప్రజలంతా.. వీరి వ్యవహారసరళిని అసహ్యించుకుంటారు. చీదరించుకుంటారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నందుకు ముందు ముందు ఇంకేమైనా తర్కబద్ధమైన ఆరోపణలు చేసినా కూడా.. వైఎస్సార కాంగ్రెస్ ను ప్రజలు అనుమానంగా చూసే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా వారి పార్టీకే పరువు పోతుంది. 

పార్టీలో కనీసం ఆ భయం కూడా ఉన్నట్టు లేదు. న్యాయవ్యవస్థ ద్వారా తమ పార్టీ ప్రభుత్వం తలచినట్లుగా దూసుకుపోవడం కుదరడం లేదనే ఉక్రోషం వారిలో యుక్తాయుక్త విచక్షణను నశింపజేస్తున్నట్టుంది. ఇలాంటి అసమంజసమైన పోకడలు… వారి క్షణికోద్రేకాల్ని సంతృప్తి పరచగలవే తప్ప.. వారికి కూడా నిజమైన మేలు చేయవు.

Tags: allegations of ysrcp on judiciaryhouse sites purchase in amaravathileotop
Previous Post

ఈఎస్ఐ స్కాంలో వైసీపీ మంత్రి పాత్ర ఎంత?

Next Post

‘ఆర్.ఆర్. ఆర్’షూటింగ్ కి తారక్, చెర్రీ, అలియా రెడీ

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Stunning Beauty Payal Rajput hottest photoshoot

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

Gorgeous Beauty Actress Tridha Choudhury Latest Glamorous Photos

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

ఎన్టీఆర్ బాటలో నడుస్తున్న కేసిఆర్

‘ఎవరు’ తరువాత రెజీనా ఏం చేస్తోంది?

వైసీపీ కార్యకర్తల జేబుల్లోకి ‘నాడు-నేడు’ నిధులు..

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist