నాగచైతన్య – సమంత విభేదాలతో విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ వార్త గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టడం.. అందులో ఆమె చేసిన కామంట్స్ ఆసక్తిగా మారింది. ఇంతకీ శ్రీ రెడ్డి ఏం చెప్పిందంటే.. అది నాగచైతన్య, సమంత పర్సనల్ విషయం. అయితే.. ఎంత పర్సనల్ అయినప్పటికీ మీరు అందరికీ బాగా దగ్గరయ్యారు. అందరి ఇళ్లల్లో మిమ్మల్ని తమ సొంత మనుషులుగా అనుకుంటున్నారు కాబట్టి బాగుండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సమంతను అయితే.. తమిళనాడులో తిడుతున్నారు. ఇంత మంచి సంబంధం.. అంత మంచి కుటుంబానికి కోడలు అయ్యింది. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్ ఉంటే.. అడ్జెస్ట్ అయి సంసారాన్ని సరిదిద్దుకోవాలి కానీ.. ఇలా కోపానికి పోయి నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు.. అని కొంత మంది అంటున్నారు. ఇది నా అభిప్రాయం కాదు.. తమిళనాడులోని నా ఫ్రెండ్స్ అందరిలో చర్చించుకున్న విషయం చెప్పాను.
మరో విషయం ఏంటంటే.. మ్యారేజ్ అయిపోయిన తర్వాత తన డ్రెసింగ్ కూడా చాలా దారుణంగా ఛేంజ్ అయిపోయింది. ఎంత కాదనుకున్నా మనకుంటూ కొన్ని పద్దతులు ఉన్నాయి. రొమన్ లో ఉంటే.. రొమన్ లా ఉండమని ఎలాగైతే అన్నారో.. ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ లా ఉండాలి. తాళి కట్టుకుని తిరుపతి మెట్లు ఎక్కింది కదా.. మేము అందరం కోరుకునేది ఏంటంటే.. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి.. అదీ ఫెయిల్ అయితే మరొకటి ఇలా చాలా వస్తాయి. నాగచైతన్యను వెనకేసుకురావడం కాదు కానీ.. అందరకీ ఈగోలు ఉంటాయి. అటీట్యూట్స్ ఉంటాయి కానీ.. జీవితం అనేది అడ్జెస్ట్ అయి వెళితేనే మనకు ప్రతిఫలం ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతాను.
సమంతకే కాదు.. నాగచైతన్య అన్నయ్యకు కూడా చెప్పేది అదే.. మీరిద్దరూ ప్రాబ్లమ్స్ గురించి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని అభిమానులు, శ్రేయాభిలాషులు కోరుకుంటున్నాం. మీరిద్దరూ కలిసుండాలని కోరుకుంటున్నాం. మీరు ఆదర్శంగా ఉండాలి.. ఏదైనా సమస్య ఉండచ్చు.. అడ్జెస్ట్ మెంట్ అనేది ఉండాలి అనుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. భార్యభర్తలు అన్నాకా కొట్టుకోవడాలు.. తిట్టుకోవడాలు.. ఈగోస్ ఉంటాయి. మిస్ అండర్ స్టాండింగ్స్ చాలా ఉంటాయి. అమ్మాయికి ఓపిక ఉండాలని భారతదేశం మనకు నేర్పించింది. సమంత కొన్ని కొన్ని మార్చుకుంటే కనుక తను కానీ… తన సంసారం కానీ బాగుంటుందని నా ఉద్దేశ్యం. హాలీవుడ్ యాక్టరస్ లాగా మనం ఉండలేం. ఎందుకంటే.. మన కల్చర్ అది కాదు కాబట్టి.
నేను చెప్పేది ఏంటంటే.. సమంత వదినా చక్కగా సంసారం చేసుకో. సినిమాలు మోడలింగ్ ఇదంతా కూడా నీకు ఇష్టం అయితే చేసుకోండి కానీ.. అడ్జెస్ట్ అయితే బాగుంటుందని నా ఉద్దేశ్యం. అందరూ వాళ్లిద్దరూ బాగుండాలని ఆశీర్వదించండి అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం వైరల్ అవుతుంది. మరి.. చై – సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Must read ;- సమంత కొత్త సినిమాకి ఓకే చెప్పిందా..?











