బాబాయ్‌ను ఎవరు చంపారు…?
మార్చి 15, 2019న కడప జిల్లా పులివెందుల్లో మాజీ మంత్రి, జగన్ రెడ్డి బాబాయ్ హత్య ఏపీ రాజకీయాలను కుదిపేశాయి. నేటికీ ఆ కుదుపులు తీసుకొచ్చి తిప్పలు అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది! కుటుంబంలో సొంత బాబాయ్ ను అత్యంత కిరాతంగా హత్య చేస్తే.. నిందుతులను చట్టప్రకారం పట్టుకుని, శిక్షించలేని ముఖ్యమంత్రి ఏపీలో పరిపాలన సాగిస్తున్నారని ప్రజలు, విపక్షాలు నిలదీస్తున్నా.. నేటికీ వివేకా హత్య కేసు కొలిక్కిరాలేదు. పాత్రదారులందరూ చెరసాలలో ఊచలు లెక్కిస్తుండగా.. సూత్రదారి అరెస్ట్ కు సీబీఐ అడుగుదూరంలో ఉండి.. తన దర్యాప్తును ముందుకు తీసుకుపోతోంది! ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం వ్యక్తం చేస్తోంది సీబీఐ. ఆ కోణంలోనే దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి వివేకను హత్య చేయించి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది సీబీఐ! ఇప్పటికే ఈ కేసులో సీబీఐ గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి ప్రమేయంపై పులివెందుల కోర్టులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో హత్యకు దారితీసిన మరిన్నో అంశాలు నేడు వెలుగుచూస్తున్నాయి. కడప ఎంపీ టికెట్ విషయంలో నెలకొన్న వివాదం హత్యకు దారితీసిందా? వైఎస్ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారా? ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ఆయనను హత్య చేయించి ఉంటారా? అన్న అనుమానంతో సీబీఐ తన దర్యాప్తును సాగిస్తోంది. హత్య వెనుక భారీ కుట్రను వెలికితేసే దిశగా తమ దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది.
హత్యకు రూ.40 కోట్ల డీల్..
వివేక హత్యకు రూ.40 కోట్ల డీల్ కుదిరింది. ఈ హత్య వెనుక పెద్దలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వంటి వారు ఉన్నారని హత్య కేసులులో నిందుతుల్లో ఒకరైన ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు సీబీఐ ఎదుట దస్తగిరి అప్రూవర్ గా మారి ఒప్పుకున్న నిజం ఇది. ఈ హత్య చేస్తే తనకు రూ.5 కోట్లు ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి ఒప్పకున్నారు. వివేక హత్య జరిగిన తరువాత ముందుగా డెడ్ బాడీ వద్దకు ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఇతర సన్నితులు వెళ్లారు. వీరితోపాటు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో ఉన్న వివేకా మృత దేహాన్ని పక్కకు జరిపి.. శివశంకర్ రెడ్డి ఆదేశాలతో పనిమనిషి లక్ష్మి రక్తపు మరకల్ని శుభ్రం చేసింది. వివేక తలకు గాయాలైన చోట్ల బ్యాండేజీ చుట్టించి కట్టు కట్టించారు. వివేక తల,నుదురు, అరచేతిపై ఏడు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తెలింది. వివేకా మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా.. గుండెపోటుతో మరణించారని అవినాష్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే మాటను శివశంకర్ రెడ్డి సాక్షి టీవీకి తొలసారిగా చెప్పారు. వివేకా కుమార్తె, అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఇలా సీబీఐ విచారణలో వివేకా హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
Must Read;-సీఎం జగన్ తో భేటీకి వెళ్లిన మెగా బృందం











