సంగం డెయిరీ వ్యవహారంలో అరెస్టైన దూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్‌పై విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది.కేసుల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మరి కొన్ని కేసులను హైకోర్టు సెలవుల అనంతరం విచారణ జరపనున్నారు.1 నుంచి 59 వరకు ఉన్న కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.సంగం డెయిరీ కేసులో అరెస్టైన దూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం రాజమండ్రిలోని డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
సంగం ఆస్తులపై ఏపీ ప్రభుత్వానిది సెలవుల తర్వాతే..
సంగం డెయిరీ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతోపాటు,వాటిని అమూల్‌కు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి కొట్టి వేశారు.దీనిపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీనిపై హైకోర్టు సెలవుల అనంతరం విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది.కేసులు ఎక్కువగా ఉండటంతో పాటు, హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో కేసుల విచారణను వాయిదా వేసినట్టు తెలిసింది.
Must Read ;- ధూళిపాళ్లకు ఊరట : ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం










