పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అంటాడు మహాకవి కాలోజీ. ఇదే మాట ప్రకాశం జిల్లా కుంభం పట్టనానికి చెందిన సయ్యద్ హుస్సెన్ ను అడిగితే.. పుట్టక నాది.. చావు నాది.. కానీ బతుకంతా టీడీపీదే అంటూ సమాధానమిస్తాడు. అవును సయ్యద్ జీవితమంతా టీడీపీకే అంకితం చేశాడు. తనకు వచ్చే పింఛన్ డబ్బులతో టీడీపీ గుర్తులు, ఎన్టీఆర్ బొమ్మలను తయారు చేస్తూ ఉచితంగా పంపిణీ చేస్తుంటాడు. 40 ఏళ్లుగా టీడీపీకే తన జీవితాన్ని అంకితం చేశాడు.
బొమ్మల తయారీ, ఉచిత పంపిణీ
సయ్యద్ హుస్సెన్ పీరాకు భార్యతో పాటు ఆరుగురు సంతానం చిన్నప్పటినుంచే టీడీపీకి వీరాభిమాని. ఎన్టీఆర్ అంటే ఎనలేని ఇష్టం. మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. సంపాదనలో సగం కుటుంబ అవసరాలు తీరుస్తూనే, మరోవైపు టీడీపీ పార్టీ గుర్తులు, బొమ్ములు తయారుచేసేవాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో ఏళ్లుగా టీడీపీ సేవకే అంకితమైన నిజమైన అభిమాని. కాలక్రమేణా ఆయన ఇంటికే పరిమితమైనా.. టీడీపీపై అభిమానం చంపుకోలేదు. బొమ్మల తయారీని విడిచిపెట్టలేదు. తనకు వచ్చే పింఛన్ డబ్బులతోనే టీడీపీ గుర్తులు, బొమ్మలు తయారు చేస్తూ తన సేవను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో పార్టీ గుర్తులు, బొమ్మలను ఉచితంగా పంపిణీ చేశాడు. టీడీపీ నాయకులు సైతం సయ్యద్ హుస్సెన్ నుంచి గిఫ్టులు పొందారంటే, ఆయన అభిమానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Must Read ;- అభిమానుల గుండెల్లోనే ‘ఎన్టీఆర్’ గుడి
40 ఏళ్లుగా..
టీడీపీపై నీకు ఎందుకంత ప్రేమ అని ఎవరైనా హుస్సెన్ ను అడిగితే… నాకు ప్రాణం ఉన్నంత వరకు టీడీపీకి సేవ చేస్తూనే ఉంటా. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు బొమ్మల తయారీని విడిచిపెట్టలేదు. పేదరికం వెంటాడినా పార్టీకి సేవ చేయడం మరిచిపోను.. అని అంటాడు.
చంద్రబాబు ట్వీట్
‘‘నిరుపేద గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ గూడు కట్టుకుని ఉంటుందనడానికి హుస్సేన్ పీరా గారు నిదర్శనం. ప్రకాశం జిల్లా కంభంకు చెందిన హుస్సేన్ పీరా గారు తనకొచ్చే పింఛను సొమ్ముతోనే తెలుగుదేశం పార్టీ గుర్తులు, ఎన్టీఆర్ బొమ్మలు స్వయంగా తయారు చేసి, ఉచితంగా పంచుతున్నారు‘‘ అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Also Read ;-రామారావు జీవితం భావి తరాలకు ఆదర్శం : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
నిరుపేద గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ గూడు కట్టుకుని ఉంటుందనడానికి హుస్సేన్ పీరా గారు నిదర్శనం. ప్రకాశం జిల్లా కంభంకు చెందిన హుస్సేన్ పీరా గారు తనకొచ్చే పింఛను సొమ్ముతోనే తెలుగుదేశం పార్టీ గుర్తులు, ఎన్టీఆర్ బొమ్మలు స్వయంగా తయారు చేసి, ఉచితంగా పంచుతున్నారు.(1/2) pic.twitter.com/fhhujPpAV0
— N Chandrababu Naidu (@ncbn) May 27, 2021