ఏపీ, విజయవాడలోని దుర్గగుడిలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నాలుగు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. స్టోర్, చీరల విభాగం, పరిపాలనా విభాగం, ప్రసాదాల తయారీ విభాగాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. సోదాల్లో భాగంగా కీలక అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తున్న అధికారులు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులు. ఇంద్రాకీలాద్రిలోని నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
సోదాల్లో వారు సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు గురించి అధికారులు ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. సోదాలు నిర్వహిస్తున్నందున సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తుంది.
Must Read ;- కాణిపాకం ఆలయంలో ఏసీబీ సోదాలు..










