ఈ మధ్యకాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో ‘జాంబిరెడ్డి‘ ఒకటి. తేజ సజ్జా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా, ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. ఈ కొత్తదనమే ఈ సినిమాకి కాసుల వర్షం కురిపించింది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమాకి లాభాలు బాగానే వచ్చాయట. దాంతో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సీక్వెల్ చేయడానికి నిర్మాత ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు.

‘జాంబిరెడ్డి’ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆసక్తితో నిర్మాత ఉండటంతో, ప్రశాంత్ వర్మ సమంత చుట్టూ కథను అల్లితే బాగుంటుందని భావించాడట. అనుకున్నట్టుగానే సమంతను ప్రధాన పాత్రగా అనుకుని కథను సిద్ధం చేసుకున్నాడని చెబుతున్నారు. ఆ తరువాత ఆయన సమంతను కలిసి కథను వినిపించాడని అంటున్నారు. కథను పూర్తిగా వినేసిన సమంత, ఈ ప్రాజెక్టును చేయడానికి ఆసక్తిని కనబరిచిందని చెబుతున్నారు. ఈ సినిమాకి ‘రివేంజ్ ఆఫ్ డెత్’ అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా తెలుస్తోంది.
కొంతకాలంగా సమంత ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ షూటింగులో బిజీగా ఉంది. తమిళంలో ఆమె విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుంది. అలాగే తెలుగులో పాన్ ఇండియా సినిమా అయిన ‘శాకుంతలం‘లో శకుంతలగా అలరించనుంది. తెరపై శకుంతల పాత్రలో కనిపించాలనే ఆశ .. ఆసక్తి ప్రతి కథానాయికకి ఉంటుంది. ఎందుకంటే ఆ పాత్ర అంత అందమైనది .. అపురూపమైనది. అలాంటి పాత్రను చేసే ఛాన్స్ సమంతకు లభించడం ఆమె అదృష్టం. ఈ సినిమా ఆమె కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలవడం ఖాయమనేది ఆమె అభిమానుల నమ్మకం.
Must Read ;- అందంతోనే వసంతం తెచ్చేసిన సమంత











