కరోనా వ్యాక్సిన్.. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న కల నిజమవుతున్న సమయం. కరోనా మహమ్మారి దెబ్బకి లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దాన్ని నివారించడానికి ఎందరో శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కోటిగా మానవులకు అందుబాటులోకి వస్తుంది. భారత్ కొవిషీల్డ్, కొవ్యాక్సిన్లకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ రేపటి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రలకు వ్యాక్సినేషన్ నియమనిబంధనలను విడుదల చేసింది. అవేంటో చూద్దాం..

- అలర్జీలు ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోకూడదు.
- గర్భవతులు, పాలిచ్చే తల్లలు టీకా తీసుకోకపోవడం మంచిది.
- ప్రస్తుతం కొవిడ్ వైరస్ సోకిన వారు టీకా తీసుకోకూడదు.
- తీవ్ర అనారోగ్యంలో ఉన్నవారు కూడా టీకా తీసుకోకూడదు.
- 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే టీకా నమోదుకు, తీసుకోవడానికి అర్హులు.
- మొదట ఒక డోసు మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత 14 రోజుల తర్వాత ఇంకో డోసు తీసుకోవాలి.
- మొదటి ఏ వ్యాక్సిన్ డోసు తీసుకున్నారో.. రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి.
139 కేంద్రాల్లో వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో ఏకకాలంలో టీకా ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గద్వాల్-880, యాదాద్రి-1160 సెంటర్లలో టీకా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. టీకా అందించే వారు, తీసుకోవాల్సిన వారు కరోనా నిబంధనలను తప్పక పాటించాలి. మాస్క్, చేతికి గోవ్స్, ఫేస్ షీల్డ్.. వంటివి ధరించి తీరాలని చెప్పారు.
Must Read ;- జనవరి 16.. 2021.. ఉదయం 10:30.. ముహుర్తం ఫిక్స్..











