స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన సంచలన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’.. అల్లు అర్జున్ – పూజా హేగ్డే జంటగా నటించిన అల.. వైకుంఠపురములో సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే.. 150కోట్లకు పైగా షేర్ సాధించి 2020లో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా ఒక ఎత్తైతే.. ఈ సినిమాలోని పాటలు మరో ఎత్తు. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం రోజుకో రికార్డును క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలోని సామజవరగమన, రాములో రాములా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తమన్ కెరీర్‌లోనే ఇంత కంటే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇక ఇవ్వలేడేమో అనేంతగా రెచ్చిపోయాడు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్ దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.
ఈ సినిమాలోని రాములో రాములో పాట ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది. అంతే కాదండోయ్.. 2020లో ఇండియా టాప్ 10 సాంగ్స్ లిస్టులో ఉన్న ఏకైక తెలుగు చిత్రం అల.. వైకుంఠపురములో కావడం విశేషం. రామజోగయ్యశాస్త్రి రాసిన బుట్టబొమ్మ సాంగ్.. ఇప్పుడు మరో సంచలన రికార్డు సాధించింది. అది ఏంటంటే… యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 500 మిలియన్ వ్యూస్ సాధించింది.
ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టిన బుట్టబొమ్మ.. మరో 200 మిలియన్స్ అందుకోడానికి నాలుగు నెలల సమయం తీసుకుంది. ఇప్పుడు 500 మిలియన్ వ్యూస్ సాధించింది. 500 మిలియన్ వ్యూస్ అంటే.. చిన్న విషయం కాదు. బహాశా ఈ పాట ఇంత హిట్ అవుతుందని.. ఈ పాట రాసిన వాళ్లు కానీ.. కొరియోగ్రఫీ చేసిన వాళ్లు కానీ..ఊహించి ఉండరు. ఈ సినిమా విడుదలై సంవత్సరం పూర్తి చేసుకోనున్న ఈ సందర్భంలో ఈ పాటకు ఇప్పట్లో ఎవరూ అందుకోలేని రికార్డు స్థాయి వ్యూస్ రావడం విశేషం.
Must Read ;- ఆచార్యకు నో చెప్పి.. అల్లు అర్జున్ కి ఓకే చెప్పిందా.?