యాక్షన్ హీరో గోపీచంద్.. యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతితో సినిమా చేయడానికి ఓకే చెప్పడం తెలిసిందే. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. మారుతి ప్రతిరోజు పండగే సినిమాతో సక్సస్ సాధించినా తదుపరి చిత్రం ఎనౌన్స్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. ఇంకా చెప్పాలంటే.. చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఆఖరికి అన్ని అడ్డంకులు దాటుకుని సినిమాని ఎనౌన్స్ చేశాడనుకుంటే.. ఇప్పుడు ఈ సినిమాకి హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ కష్టాలు ఏంటంటే.. ఇందులో గోపీచంద్ సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. సాయిపల్లవి వరుసగా సినిమాలతో బిజీగా ఉండడం వలనో ఏమో కానీ.. ఈ సినిమా కోసం మరో హీరో కథానాయికను పరిశీలిస్తున్నారు.
రాశీఖన్నాను ఎంపిక చేద్దామనుకుంటే.. గోపీచంద్ నో అంటున్నారట. కారణం ఏంటంటే.. రాశీఖన్నా గోపీచంద్ తో ‘జిల్, ఆక్సిజన్’ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలూ నిరాశపరిచాయి . అందుకనే అనుకుంట గోపీచంద్ రాశీఖన్నా పేరు చెబితే నో ఎట్టిపరిస్థితుల్లో వద్దు అని చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. శ్రీనివాసకళ్యాణం, అయోగ్య, వరల్డ్ ఫేమస్ లవర్.. ఇలా రాశీఖన్నా ఇటీవల నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం కూడా మరో కారణం కావచ్చు. దీంతో కొత్త అమ్మాయిని తీసుకోవాలి అనుకుంటున్నారని తెలిసింది.
Must Read ;- ఇక్కడే కాదు..రాశీకి అక్కడా పెరిగాయి!











