యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే సినిమా రావడం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రేజీ మూవీని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. కరోనా కారణంగా ఆగింది. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి.
అయితే.. కొత్త సంవత్సరం సందర్భంగా తారక్ – త్రివిక్రమ్ కలవడం జరిగింది. ఈ ఫోటోలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి త్వరలో సినిమా ఉంటుందని తెలియచేసింది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ మూవీని సంక్రాంతికి పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు ముహుర్తం కుదిరిందని వార్తలు వస్తున్నాయి.
ఆ తర్వాత తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసి అప్పుడు త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాడని టాక్ వినిపిస్తోంది. దీనికి అయిననూ ‘పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. బాలీవుడ్ హీరోయిన్స్ ను పరిశీలిస్తున్నారని తెలిసింది. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అరవింద సమేత’ సినిమాతో సంచలనం సృష్టించిన తారక్ – త్రివిక్రమ్ ఈసారి ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తారో చూడాలి.
mUST rEAD ;- మరోసారి వార్తల్లో నిలిచిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ